చిత్తూరు

అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 26: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ రకాల దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇరానీ దొంగలముఠాను క్రైం, సివిల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదివారం తిరుచానూరు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం రావడంతో వీరి కోసం గాలింపుచర్యలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో టి ఎన్ 23 బిజె 9723 అనే వాహనాన్ని అనుమానాస్పదంగా నిలిపి ఉన్న నేపథ్యంలో తిరుచానూరు ఎస్ ఐ సురేంద్రనాయుడు తమ సిబ్బందితో ఆ కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారన్నారు. దీంతో వాహనంలో పారిపోవడానికి వారు ప్రయత్నించారని, పోలీసులు చుట్టుముట్టివారిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 19చోట్ల 730 గ్రాములు, తిరుపతి సి సి ఎస్ పరిధిలో 10 చోరీల్లో 249 గ్రాములు, ఎమ్ ఆర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో 6చోరీల్లో 164 గ్రాములు, అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోరీల్లో 101గ్రాములు, పలమనేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 చోరీల్లో 84 గ్రాములు, గంగవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 1చోరీలో 15 గ్రాములు, పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చోరీలో 44 గ్రాములు, మదనపల్లి వన్‌టౌన్ పరిధిలో 1 చోరీలో 25 గ్రాములు, మదనపల్లి టూటౌన్ పరిధిలో 2 కేసుల్లో 125 గ్రాములు, గాజులమండ్యం పరిధిలో 2 కేసుల్లో 64 గ్రాములు, తిరపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 64 గ్రాముల బంగారు చైన్లను చోరీ చేశారన్నారు. మొత్తం 1661 గ్రాముల బరువుగలిగిన బంగారు చైన్‌లలో 1622 గ్రాములు స్వాధీనంచేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం తిరుపతి అర్బన్ పరిధిలో 41చోరీలు, జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో 7చోరీలు చేసి తప్పించుకు తిరుగుతూ పట్టుబడ్డారన్నారు. కాగా ఇరానీ ముఠాకు చెందిన వారు 9 మందని విచారణలో తేలిందన్నారు. వీరిలో పలమనేరుకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ (37), అనంతపూర్ జిల్లా గుంతకల్‌కు చెందిన ఎస్.ముస్లిం (24), చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన టి.హరిబాబు (35), మహారాష్టక్రు చెందిన ఎస్‌కె ఇరానీని(22) అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి రూ.50 లక్షలు విలువచేసే బంగారుచైన్లు, ఇండిగోకారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపడం జరిగిందన్నారు. ఈ ముఠాలో తప్పించుకు తిరుగుతున్న మహారాష్ట్ర బివాండికి చెందిన అబ్బాస్ ఇరానీ (26), అలాగే తబ్రేజ్ ఇరానీ (28), అసూ (30), గుంతకల్‌కు చెందిన నాందర్ (28), గుంతకల్‌కు చెందిన కసై అలియాస్ అబాస్ (26) ఉన్నారని, వీరిని కూడా త్వరలోనే అరెస్ట్‌చేస్తామన్నారు. పలమనేరుకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్, కె ఎస్ మహబూబ్ అలీ, సల్మాన్, మదనపల్లికి చెందిన టి.హరిబాబు ఈ ముఠాకు ఆశ్రయం కల్పించి చోరీకి సహాయపడేవారన్నారు. వీరంతా బృందాలుగా విడిపోయి ఎప్పుడు ఎక్కడ ఎలా చోరీలు చేయాలి అని ప్రణాళికలు రూపొందించుకొని ఆ పథకం ప్రకారం చోరీచేసేవారన్నారు. ఇందులో భాగంగా కారు యజమాని అయిన హరిబాబు ఈ ముఠా చోరీచేసే సమయంలో కారును పట్టణ శివారులో ఉంచుకొని నేరం జరిగిన వెంటనే వారిని అక్కడనుంచి తీసుకెళ్లడానికి సహాయపడేవారన్నారు. ఇక ఖాదర్, నందార్‌లు మోటారు సైకిళ్ల ప్లేట్లను తొలగించి ఎంపికచేసుకున్న ప్రాంతాల్లో మహిళల మెడల్లోంచి చైన్లను దొంగతనం చేసేవారన్నారు. చోరీచేసిన వెంటనే సిద్ధంగా ఉన్న కారులోపారిపోయేవారని, అదే సమయంలో తాము వచ్చిన మోటార్‌సైకిల్ నెంబర్ ప్లేటులు అమర్చుకొని ఎవరికి అనుమానం రాకుండా మదనపల్లి, కలకడ, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెల్టర్‌లలోకి వెళ్లి తలదాచుకునేవారన్నారు. అటు తరువాత కొంత విరామం ఇచ్చి తిరిగి చోరీకి పాల్పడేవారన్నారు. 2014 సంవత్సరం నుంచి నేటి వరకు తిరుపతి అర్బన్ జిల్లాలో 41 చైన్ దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వాస్తవానికి 2 కేజీల బంగారును దొంగతనం చేసిన తరువాత వాటిని విక్రయించి స్థిరపడాలని యోచించడంతో తమ వద్ద ఉన్న 48 బంగారు చైన్లను తీసుకొని తిరుపతిలో మకాం పెట్టారన్నారు. ఈనేపథ్యంలో తిరుచానూరు ఇన్స్‌పెక్టర్ కెవి సురేంద్రనాయుడు, ఎస్ ఐ రామాంజునేయులు, ప్రవీణ్‌కుమార్, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైం పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రవిప్రకాష్, రాజు, రవిరెడ్డి, ముజీబ్, కానిస్టేబుళ్లు గౌరినాయుడు, రమేష్, ఈశ్వర్, నాగరాజు, ఫరూఖ్ అలీ, మనోహర్ మునీంద్ర, తిరుమల టు టౌన్ ఇన్స్‌పెక్టర్ రవిలు ఎంతో ప్రతిభ కనబరిచారని, వీరందరికీ రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే వీరికి పర్యవేక్షణ అధికారులుగా తిరుమల అడిషినల్ ఎస్పీ కెవి మురళీకృష్ణ వ్యవహరించారని, వీరిని కూడా అభినందించడం జరిగిందన్నారు.