ప్రకాశం

రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూన్ 26: ఈనెల 28న రాష్టవ్య్రాప్తంగా అన్ని పాఠశాలల్లో బంద్ నిర్వహిస్తున్నట్లు ఎబివిపి సంఘటనా కార్యదర్శి హనుమంతు తెలిపారు. సోమవారం ఎబివిపి కార్యాలయంలో ముఖ్యకార్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా బుధవారం అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపారు. రాష్టక్రమిటీ పిలుపులో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్నిపాఠశాలలను మూసివేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం విధులు నిర్వహించటం విఫలమైందన్నారు. జివో నెంబరు ఒకటిని ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉన్న పుస్తకాలు,బట్టల దుకాణాలను వేయాలన్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేతను ఆపాలన్నారు. కేజినుండి పిజి వరకు బ్రాండ్‌పేరుతో జరుగుతున్న విద్యావ్యాపారాన్ని అరికట్టాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలని, ఫీజు రెగ్యూలేటరి కమిషన్‌ను ఏర్పాటుచేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న విద్యాశాఖాధికారి పోస్టులు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి పోస్టులు, మండల విద్యాశాఖాధికారి పోస్టులను వెంటనే భర్తీచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో, హాస్టళ్లల్లో వౌలిక వసతులు కల్పించాలన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వెంటనే వాటిని మూసివేయాలన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలల అనుబంధ హాస్టళ్లను గుర్తించి మూసివేయించాలన్నారు. డిఎస్‌సిని ప్రకటించి ఖాళీగా ఉన్న 15వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీచేయాలన్నారు. ఈసమావేశంలో ఎబివిపి నాయకులు శివ, శ్రీనివాస్, సురేంద్ర, శ్రీకాంత్, వెంకటకృష్ణ,మురళీ, సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను వారు ఆవిష్కరించారు.