శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భక్తిశ్రద్ధలతో రంజాన్...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూన్ 26: ముస్లిం సోదరులు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో సోమవారం రంజాన్ పండుగను జరుపుకున్నారు. నెలరోజులపాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు ఆదివారం రాత్రి నెలవంక దర్శనంతో సోమవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంతో పాటు ఆత్మకూరు, కావలి, గూడూరు డివిజన్లలోని ఈద్గాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని బారాషహీద్‌దర్గా, నవాబుపేట, ఈద్గామిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న ఈద్గాల్లో పండుగ నమాజును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ముస్లిం పెద్దలు ప్రసంగిస్తూ ప్రతి ముస్లింపై అల్లాహ్ ఉపవాసాలను విధిగా చేసాడని, దాంతో అందరూ నెలరోజులపాటు ఉపవాసాలు పాటించారన్నారు. దైవప్రవక్త ముహ్మద్(సొ) సున్నత్ (సాంప్రదాయాలను) తూచా తప్పకుండా పాటించి దైవప్రసన్నతను పొందేందుకు అందరూ కృషి చేయడం జరిగిందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు సమయానికి నమాజు చేస్తూ దైవ మార్గంలో ఎలా ఉన్నారో అలాగే మిగిలిన 11 నెలలు గడపాలన్నదే ఈ మాసం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్క ముస్లిం ప్రవక్త (సొ) సూక్తులను పాటిస్తూ జీవనం గడపాలని, ఆనాధల పట్ల ప్రేమతో వ్యవహరించాలని కోరారు.
కిక్కిరిసిన ఈద్గాలు, మసీదు
ముస్లిం సోదరులతో నెల్లూరు నగరంలో ఉన్న ఈద్గాలు, మసీదులు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా బారాషహీద్ దర్గాలో ఉన్న ఈద్గా, ఈద్గామిట్ట, జెండావీధి, ఖుద్దూస్‌మసీదు, ఇస్లామిక్‌సెంటర్, హాల్తాలీమ్‌మసీదు, డ్రైవర్స్‌కాలనీ, నవాబుపేట, బారకాసు మసీదుతోపాటు అన్ని మసీదుల్లో ముస్లిం సోదరులతో కళకళలాడాయి. పండగ నమాజును ఆయా ప్రాంతాల వెసులుబాటును బట్టి ఉదయం 8గంటలకు, 9గంటలకు, 10.30, 11గంటలకు ఏర్పాటు చేయడంతో మసీదులకు వెళ్లి నమాజులు చేసుకున్న వారు మినహా మిగిలిన వారంతా బారాహషీద్ దర్గాకు చేరుకున్నారు. దాంతో ఈద్గాలో ఏర్పాటు చేసిన షామియానాలు చాలక కొందరు బయట ప్రాంగణంలో కండువాలు వేసుకొని మరీ నమాజులు చేశారు.
ప్రార్థనలో పాల్గొన్న మంత్రి
రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బారాషాహిద్ దర్గా, మసీదుల అభివృద్ధికి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు 20కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆ ఆల్లాహ్‌ను ప్రార్థించామన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.