తూర్పుగోదావరి

మలేరియా మహమ్మారికి విద్యార్థి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, జూన్ 26: మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఒక విద్యార్థి మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. శ్రీరామగిరి గ్రామానికి చెందిన కమ్మచిచ్చు సత్తిబాబు ఇద్దరు కుమారులు యశ్వంత్, హేమంత్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. రేఖపల్లి పిహెచ్‌సిలో వైద్యం అందించి, అనంతరం సోమవారం కూనవరం ప్రభుత్వ వైద్యశాలలో చూపించగా వారు భద్రాచలం రిఫర్ చేశారు. అక్కడ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ యశ్వంత్ (9) మృతిచెందాడు. అతని సోదరుడు హేమంత్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న హేమంత్‌ని మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇదే విద్యార్థుల నానమ్మ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. చనిపోయిన విద్యార్థి కూనవరంలోని విజయసాధన కానె్వంట్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వైద్యశిబిరాలు నిర్వహించాలి
కోరలు చాస్తున్న మలేరియా మహమ్మారిని పారదోలటానికి శ్రీరామగిరి గ్రామంలోను, ఏజన్సీ గ్రామాల్లోను ప్రభుత్వం వైద్యశిబిరాలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.