తూర్పుగోదావరి

ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 26: ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా కొత్త ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. ప్రజలతో పోలీసులు స్నేహసంబంధాలను కొనసాగించేలా చూస్తూ, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఇతోధికంగా పాటుపడతానని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఎస్పీగా విశాల్ గున్నీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాపై అవగాహన పెంచుకుంటానన్నారు. తరచూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, జిల్లాలోని సమస్యలపై అవగాహన చేసుకుంటానని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తానని, ప్రజలకు మంచి పోలీసింగ్‌ను అందించడమే ప్రథాన ధ్యేయమని పేర్కొన్నారు. పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటట్టు చూస్తానన్నారు. ప్రజలెవరైనా తమ సమస్యలను నేరుగా ఎస్సైలు, సిఐలకు లేక తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసు శాఖలో అవినీతిని సహించనని స్పష్టం చేశారు. గతంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ఒఎస్‌డిగా పనిచేసిన సమయంలో గంజాయిపై అవగాహన కలిగిందని, జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. మావోయిస్ట్‌ల కార్యకలాపాలు, ఏజన్సీలో సమస్యలపై అధికారులతో సమీక్షిస్తానని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మాజీ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాకు ఏడాదిన్నర పాటు ఎస్పీగా పనిచేశానని, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా రావడం ఆనందంగా ఉందని విశాల్ గున్నీ పేర్కొన్నారు. అడిషినల్ ఎస్పీ ఎఆర్ దామోదర్, ఒఎస్‌డి రవిశంకర్‌రెడ్డి, జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, ఇతర వర్గాల వారు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
హోం మంత్రిని కలిసిన ఎస్పీ...
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని విశాల్ గున్నీ జిల్లా కేంద్రం కాకినాడలోని అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై హోం మంత్రి చినరాజప్ప ఎస్పీకి సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, జిల్లాలో పోలీసు శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు.