తూర్పుగోదావరి

ఎరుపెక్కిన గోదారమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 26: అఖండ గోదావరి నది ఎర్రబడింది.. ఇప్పటి వరకు నీలం రంగులో వున్న గోదావరి నది సుమారు ఏడాది తర్వాత ఎరుపు రంగు సంతరించుకుంది.. గోదావరి నది ఆవాసిత ప్రాంతాల్లో స్థానికంగా కురిసిన వర్షాల వల్ల గోదావరి నది ఎర్రబడింది.. గోదావరి నదికి వరదల పోటు ఈ సీజన్‌లో ఇంకా ఎదురు కాలేదు. సోమవారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10.50 అడుగుల నీటి మట్టం నమోదైంది. పాండ్ లెవెల్ 13.87 మీటర్లు స్థిరీకరించారు. మొత్తం మూడు డెల్టాలకు 11,400 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు. 17,785 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. భద్రాచలం వద్ద 8.2 అడుగులు నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి 175 గేట్లు మూసి వేశారు. సెంట్రల్ డెల్టాకు 2,000 క్యూసెక్కులు, ఈస్ట్రన్ డెల్టాకు 3,200, వెస్ట్రన్ డెల్టాకు 6,000 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. కుంట వద్ద నీటి మట్టం సోమవారం రాత్రికి 40 సెంటీ మీటర్ల చొప్పున పెరుగుదల కన్పించింది. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల గోదావరి నదిలో నీరు ఎర్రబడింది. మరో రెండు మూడు రోజుల పాటు నీటి లభ్యత మరింత పెరిగే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా వుండగా సీలేరు నుంచి కూడా జలాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పధకం నుంచి గోదావరి జలాలను గత 19వ తేదీ నుంచి తోడుతున్నారు. దీంతో కృష్ణా డెల్టాలో కూడా ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. అదే విధంగా గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పనులు వేగం పుంజుకున్నాయి. అయితే జిల్లాలో జూలై నెలాఖరుకల్లా నాట్లు పూర్తిచేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు కూడా సిద్ధంగా వున్నాయని చెబుతున్నారు. వాతావరణం అనుకూలించింది కాబట్టి సకాలంలో వ్యవసాయ పనులు పూర్తిచేసి నిర్దేశిత మూడు పంటల విధానానికి రైతులంతా సహకరించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. అయితే జిల్లాలో కొన్ని కాల్వల పరిధిలోని శివారు ప్రాంతాలకు నీరు అందని వైనం కన్పిస్తోంది. సామర్లకోట కెనాల్ పరిధిలో ఈ పరిస్థితి అధికంగా కన్పిస్తోంది. దీనికి ప్రధాన కారణంగా అక్కడ పూడిక తీత, ఆధునీకరణ పనులు జరుగుతుండటం వల్ల నీరు అందని స్థితి కన్పిస్తోందంటున్నారు. దీంతో కొన్ని చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నీటిని కాల్వ సామర్ధ్యం మేరకు విడుదల చేసినట్టు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ పనులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సకాలంలో నిర్ధేశిత ఖరీఫ్ కార్యాచరణ పూర్తి చేయాలనే ముందస్తుగా నీటిని విడుదల చేశామని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పనులు ఊపందుకోవడం, గోదావరి ఎర్రబడ్డంతో అంటే నీటి లభ్యత అధికం కావడంతో మెట్ట ప్రాంతంలో కూడా పనులు జోరుగా సాగుతున్నాయి.