పశ్చిమగోదావరి

విషాద ప్రేమకథ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, జూన్ 26: మైనార్టీ కూడా తీరని ఒక యువతి... అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది... మూడేళ్లుగా వారిరువురూ ప్రేమించుకుంటున్నారు. మరో ఏడాదిలో యువతి మేజర్ అవుతుంది. అప్పుడు పెద్దలను ఎదిరించైనా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈలోగానే యువతికి పెద్దలు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీనితో ఇష్టంలేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని భయపడిన ఆమె తన ప్రియుడితో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే విధి వక్రించింది. ముందుగా గోదావరిలో దూకిన ప్రియుడు గల్లంతుకాగా, దూకడానికి సిద్ధమవుతున్న యువతిని మాత్రం స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. విచిత్రమైన ఈ విషాద ప్రేమవ్యవహారం యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గగ్గిపర్రు గ్రామానికి చెందిన కేతా లీలాశ్రీ, బొంతు నాగబాబు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగబాబు ఆటో డ్రైవరు. లీలాశ్రీ తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటోంది. తండ్రి విశాఖలో ఉండటంతో, గగ్గిపర్రులోని తాతగారి ఇంటి వద్ద ఉంటోంది. లీలాశ్రీకి మరో ఏడాదికి మైనారిటీ తీరుతుంది. అప్పుడు ఇద్దరూ వివాహం చేసుకోవాలని నాగబాబు, లీలాశ్రీ నిశ్చయించుకున్నారు. అయితే లీలాశ్రీకి పెద్దలు పెళ్లి సంబంధాలు సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీనితో తనకు ఇష్టం లేని వివాహం చేస్తారేమోనని లీలాశ్రీ భయపడింది. ప్రియుడు నాగరాజుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి మోటారు సైకిల్‌పై బయలుదేరారు. చించినాడ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఇద్దరూ గోదావరిలో దూకేయాలని నిశ్చయించుకున్నారు. మోటారు సైకిల్‌ను బ్రిడ్జివద్ద నిలిపి, ముందుగా నాగరాజు గోదావరిలో దూకేశాడు. అతని వెనుక లీలాశ్రీ నదిలో దూకేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే బ్రిడ్జిపై ఉన్న వారు లీలాశ్రీని నదిలో దూకకుండా అడ్డుకున్నారు. యలమంచిలి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న యలమంచిలి ఎస్‌ఐ అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు బ్రిడ్జి వద్దకు చేరుకుని నదిలో దూకిన నాగబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అతని ఆచూకీ తెలియరాలేదు. ఈ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం సృష్టించింది.