పశ్చిమగోదావరి

చాపరాయి ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, జూన్ 26: తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో 16 మంది ఆదివాసీల మృతి ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు, ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. చాపరాయి మృతి సంఘటనపై బుట్టాయగూడెంలో సోమవారం జరిగిన ఇక సమావేశంలో మధు మాట్లాడుతూ రెండుమూడు వారాల్లో దశలవారీగా ఆదివాసీలు మృత్యువాత పడుతుంటే జిల్లా అధికారులు, ఐటిడిఎ అధికారులు, వైద్యసిబ్బంది కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వానికి స్మార్ట్‌సిటీలు, ఐటి కారిడార్‌లు తప్ప ఆదివాసీల బతుకులు పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యంలో ఆదివాసీలు విషజ్వరాలతో పదులసంఖ్యలో మృత్యువు పాలైన తరువాత రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా కలెక్టరు, ఐటిడిఎ పివో చేసిన హడావుడి పర్యటనలతో ఏమి ఒరుగుతుందని అన్నారు. ఆదివాసీల రక్షణపై కనీస బాధ్యత లేని ప్రభుత్వానికి ఆదివాసీలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు. చాపరాయి ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి పదిలక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పరిషత్‌ల నేతలు కుంజా కృష్ణంరాజు, శ్రీను, లక్ష్మణ్, మల్లయ్య, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.