చివరి దశలో గౌతమ్‌నంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యాన్లీమ్యాన్ గోపీచంద్ చేస్తున్న చిత్రాల్లో సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమ్‌నంద’ ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. గోపీచంద్-హన్సికల మధ్య ‘మోలె రామ్ మోలె రామ్’ అనే రొమాంటిక్ పాటను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఈ స్పెషల్ రొమాంటిక్ సాంగ్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. గతంలో సంపత్ నంది చరణ్ ‘రచ్చ’ సినిమాలో ‘వాన వాన వెల్లువాయె’, బెంగాల్ టైగర్‌లో ‘చూపులతో దీపాల’ వంటి పాటలను అందంగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. జె.్భగవాన్, జె.పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా హన్సిక, క్యాథరిన్ ట్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దుబాయ్ వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గోపీచంద్, సంపత్‌నందిల కెరీర్లకు కీలకమైన చిత్రం.