వెనక్కి మళ్లిన జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, మెహరీన్ ఫీర్జాదా జంటగా అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై రవి బి.వి.ఎస్ దర్శకత్వంలో కృష్ణ రూపొందించిన చిత్రం ‘జవాన్’. టాకీపార్ట్ పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు. దర్శకుడు చెప్పిన కథ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉన్నదని, హీరో హీరోయిన్లు స్క్రీన్‌పై అందంగా కనిపించారని, మిగిలిన షూటింగ్ పార్ట్‌ను జూలైలో పూర్తిచేస్తామని నిర్మాత తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆగస్టులోగా ముగించి సెప్టెంబర్ 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా యువతకు నచ్చుతుందని అన్నారు. సాయిధరమ్ తేజ్ ఓ వైవిధ్యమైన పాత్రలో కన్పిస్తాడని, దేశానికి జవాన్ ఎంత అవసరమో, ప్రతి ఇంటికి తమ సినిమాలోని హీరోలాంటివాడు ఒకడు ఉండాలని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని దర్శకుడు తెలిపారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయనే కథనంతో సినిమా సాగుతుందని ఆయన అన్నారు. ప్రసన్న, జయప్రకాష్, ఈశ్వరీరావు తదితరులు నటించారు.