సబ్ ఫీచర్

కరోఢ్‌పతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పయిదేళ్ల సౌమ్య ముఖర్జీ కరోడ్‌పతి అయ్యా డు. ఢిల్లీలోని సీతా ట్రావెల్స్‌లో ఐదంకెల జీతం తీసుకునే ఈ యువకుడు నేడు కోటి బహుమతి సంపాదించి కరోడ్‌పతిగా మారా డు. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ నిర్వహించిన పోటీలో ఈ ఫోన్ వినియోగదారులు మాత్రమే పాల్గొనేలా పోటీ నిర్వహించింది. ఫైనల్‌లో ఆరుగురు నిలిచారు. ఈ ఆరుగురులో ముఖర్జీ విజేతగా నిలిచి కోటి రూపాయల బహుమతి పొందాడు. తొలి రౌండ్‌లో ముంబయికి చెందిన పోటీదారుడికంటే వెనుకంజ వేసినా రెండవ రౌండ్‌లో మళ్లీ పుంజుకుని ముందుకు దూసుకుపోయాడు. విజేతగా అనౌన్స్ చేసిన వెంటనే అతనికి వచ్చిన మొదటి కాల్ ఎవరిదో తెలుసా ఆయన తల్లిదే. ముఖర్జీ తాను కోటి రూపాయలు గెలుచుకున్న విషయాన్ని తొలిసారి తల్లికే ఫోన్‌చేసి చెప్పాడు. ఆమె దీవెనలు ఆతన్ని ఆనందడోలికల్లో ముంచెత్తింది. భువనేశ్వర్‌కు చెందిన ముఖర్జీ దాదాపు తల్లిదండ్రులకు దూరంగా గత 18 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. వారితో సంబంధ బాంధవ్యాలు లేవు. తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. స్కూలు విద్య నుంచి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేశాడు. స్వశక్తితో చదువుకుని ఎంబీఏ పూర్తిచేశాడు. నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగం అంటే అతనికి ఇష్టం లేదు. ఈ ఆలోచనతోనే సంవత్సరానికి ఏడు లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఎదైనా చేయాలని భావించాడు. ఉద్యోగం వదిలేసేనాటికి అతని బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. కాని ఈరోజు కోటి రూపాయలు వచ్చి చేరాయి. ఈ డబ్బుతో భువనేశ్వరిలో హోంస్టే రిసార్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ డబ్బుతో వ్యాపారవేత్తగా మారగలననే విశ్వాసాన్ని సైతం వ్యక్తం చేస్తున్నాడు.