నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంచన వస్తు సంకలిత కల్మష మగ్ని పుటంబు వెట్టి వా
రించిన రీతి నాత్మ నిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తి యోగదహనార్చి దగుల్పక పాయునే కన
త్కాంచన కుండలాభరణ దాశరథీ! కరుణా పయోనిధీ

భావము:చెవులకు ప్రకాశించే బంగారు ఆభరణాలను ధరించిన దశరథరామా! బంగారులోని మాలిన్యము అగ్నిపుటమువలన తొలగిపోయినట్లు మానవుని ఆత్మలో వ్యాపించి యున్న మూడు విధములైన మాలిన్యములు నీయందలి భక్తి యోగమనెడు అగ్నిజ్వాలలో పడక చేర నశింపవు కదా! నీ యందలి భక్తి యోగము చేతనే నశించును కానీ మరొక విధముగా ఈ మాలిన్యములు నశింపవు కదా అని భావము.
దాశరథీ శతకములోని పద్యము