మంచి మాట

ఆషాఢవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృఆరాధన అనాదిగా వస్తున్నదే. ఆషాఢంలో అమ్మ ఆరాధన ప్రత్యేకతను సంతరించుకుంటుంది. దసరా నవరాత్రుల్లో ఆలయాల్లో, ఇండ్లల్లోను అమ్మను శక్తిస్వరూపిణిగా ఆరాధిస్తుంటారు. ఆషాఢంలో మాత్రం ఆ శక్తి స్వరూపిణినే గ్రామదేవతగా ఆరాధిస్తారు. పోలేరమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, అంకాళమ్మ, చెంగాళమ్మ, మశమ్మ, పోశమ్మ, రేణుకమ్మ, మైసమ్మ, పెద్దమ్మ గట్టు, కట్టు మైసమ్మ అంటూ ఎన్నో పేర్లు పెట్టి మరీ ఆరాధిస్తుంటారు.
ప్రతి గ్రామ సరిహద్దులల్లో అమ్మను నెలకొల్పి ఆగ్రామప్రజలల్లో మశూచి, మలేరియా, కలరా వంటి అంటువ్యాధులు కాని, దీర్ఘవ్యాధులు కాని రాకుండా ఉండాలని అమ్మతల్లిని వేడుకుంటూ జాతర్లు జరుపుతారు. జాతర్లల్లో తెలుగువారి సంప్రదాయాలు, సంస్కృతి తెలియజెప్పే ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు జరుపుతారు.
జానపదకళలకు ఈ జాతర ఒక వేదిక అవుతుంది. అమ్మను పూజించే క్రమంలోనే పురుషులు స్ర్తిలు పిల్లలు అందరూ తమ సంతోషాన్ని వెలిబుచ్చడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. తెలంగాణా ప్రాంతంలో ఆషాడ ఆదివారాలు అమ్మ ఆరాధన ప్రత్యేకంగా బోనాల పేరిట జరుగుతాయ. వివిధ కళలకు ప్రోత్సాహాన్నిఇచ్చేవిగాను, మానవుల్లోని ఐక్యతను పెంచడానికి దోహదం చేసివిగాను, శ్రామికులెందరికో కావాల్సినంత పని దానికి తగ్గ ఫలితం కూడా దొరుకుతుందని దానివల్లవారిలో సృజనాత్మకత కు మార్గం ఏర్పడుతుంది కనుక ఈ జాతర్లను ప్రోత్సహించడం మంచిదనే హేతువాదులు కూడా ఉన్నారు. కలసి ఉంటే కలధు సుఖం అనేభారతీయ నానుడికి ఈ జాతర్లు పట్టుగొమ్మలవలె పనిచేస్తాయ. తమిళనాడులో అమ్మఆరాధనలో కుడుముల నివేదన ప్రత్యేకతను పొందుతుంది. దీనితో పాటుగా విఘ్నేశ్వరుని పూజలు కూడా చేస్తుంటారు.
వర్షఋతువు కారణంగానో మరేదాని వల్లనైనా సంక్రమించే అనారోగ్యాలనుంచి కాపాడి తమకు సంపూర్ణఆరోగ్యాన్నిప్రసాదించమని అమ్మను కోరుతూ బోనం అంటూ అమ్మకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
సృష్టికర్తసర్వ లోకాలకు తండ్రి అయిన వైకుంఠవాసునికి కూడా ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ మాసపు ఏకాదశినాడు క్షీరాబ్దిలో పవళిస్తాడు. దీన్ని పురస్కరించుకుని విశేషపూజలు జరుపుతారు. ఈ ఏకాదశినే హరివాసరమని, శయనైకాదశిని, నిర్జలైకాదశి, తొలిఏకాదశి, ముక్తినిప్రసాదించే ఏకాదశి అనీ అంటారు.
ఈ ఏకాదశినుంచే చాతుర్మాసవ్రతారంభం యతులు చేస్తారు. అలంకార ప్రియుడైన మహావిష్ణువుకు సన్నజాజులు ప్రియం అనీ వాటితో అలంకరించి పూజిస్తారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు ఈ ఏకాదశినాడే దక్షిణంవైపు వాలినట్టు కనిపిస్తాడనీ అంటారు. సకల దేవతాస్వరూపమైన గోమహాలక్ష్మిని పూజించడం కూడా తొలిఏకాదశి విశేషమే.
త్రిమూర్తులకు సైతం ఆరాధ్యుడైన గురువును సంభావించటం, గౌరవించటం ఈ మాసపు పౌర్ణమిరోజున ఉన్న ప్రత్యేకత. ఆషాఢ పూర్ణిమనే వ్యాసపూర్ణిమ అనీ అంటారు. పరపీడనమే పరమపాపమని పరోపకారమే పరమశ్రేష్ఠమనితన రచనల ద్వారా తెలియచెప్పిన వ్యాసుని ఆర్ఘ్య పాద్యాదులను సమర్పిస్తూ వ్యాస దర్శనం కోసం ఆర్తితో కోరితే వ్యాస దర్శనం తప్పక కలుగుతుంది. గురువును మించిన శక్తి ముల్లోకాల్లోను లేదని తెలియచెప్పడానికే కలియుగదైవం గా భావించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ గురువులను సేవించి సాధరణ జీవనులకు గురుమహాత్య్మాన్ని చెప్పారు.
సద్గురువు ల ఆశీస్సులుంటే త్రిలోకాధిపత్యం కూడా లభిస్తుందని మనకు చరిత్ర చెబుతుంది కనుక ఆషాఢ పూర్ణిమ నాడు గురువులను సేవించడం పూజించడం ఆనవాయతీగా మారింది. దేశ, జాతి, సాహిత్య ధర్మ, సంస్కృతుల అస్తిత్వానికి శక్తిమేరకు సహకరిస్తూ పరోపకారం మిదం శరీరం అని జీవిస్తే చాలు త్రిమూర్తులకన్న గొప్పవాడైన గురువు అనుగ్రహం తప్పక దొరుకుతుంది.
ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజూ విశేషమైనదనీ భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు.

- గున్న కృష్ణమూర్తి