ఫోకస్

అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేనున్న జిఎస్టీపై ముందు అవగాహన కల్పించాలి. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ వల్ల పెద్ద వ్యాపారులకు నష్టమేమి జరుగకపోయినా, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో జిఎస్టీ బిల్లు ఆమోదింపబడినప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. ఐదు రకాలుగా విధించే పన్ను విధానంపై పూర్తి అవగాహన లేకే వ్యాపారులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రం ప్రకటనలు చేస్తున్నా అసలు టాక్స్ అధిక శాతం వసూలయ్యేది నిత్యావసర వస్తువులపైనేనని ప్రజల్లో అపోహ ఉంది. చట్టబద్ధంగానే జిఎస్టీ అమల్లోకి తెస్తున్న అధికార యంత్రాంగం పన్ను విధానంపై స్పష్టత ఇవ్వాలి. జిఎస్టీతో తీవ్రభారం పడుతుందనే అపోహను తొలగించాలి. మరో వారం రోజులనుంచి అమల్లోకి రానున్న జిఎస్టీ ప్రజలపై పెనుభారం వేయడం లేదని, సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలపై, వ్యాపారులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ప్రకటనలు చేయాలి. పరిశ్రమలు, బడా వ్యాపారులు జిఎస్టీ విధానాన్ని స్వాగతిస్తున్నా.. చిన్న వ్యాపారులకు మాత్రం జిఎస్టీపై అసలు అవగాహనే లేదు. ధరలు పెరుగుతున్నాయి.. ఎంత పెరుగుతుంది? ఏం చేయాలి? అనే ప్రశ్నలతోనే గడపాల్సి వస్తుంది. ప్రభుత్వ విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే వ్యాపారులు జిఎస్టీకి దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పటివరకు కనీసం 20శాతం కూడా జిఎస్టీకి దరఖాస్తులు చేసుకోలేదని తెలుస్తోంది. జిఎస్టీపై ప్రభుత్వం ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి.
- రాజారెడ్డి
లోక్‌సత్తా, జాతీయ ఫైనాన్స్ కమిటీ చైర్మన్