ఫోకస్

ధరలు తగ్గుతాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిఎస్‌టితో నగదు అక్రమ చలామణి తగ్గిపోతుంది. అలాగే పన్ను ఉన్న వస్తువులలో కొన్నింటికి మినహాయింపునిచ్చారు. దీనివల్ల కొత్తగా పన్ను విధించిన వ్యాపారులకు కొంతమేరకు ఇబ్బంది కలుగుతుంది. అందులో వస్త్ర వ్యాపారం ఒకటి. దేశంలో ఎక్కువమంది నిరక్షరాస్యులు చేసే వస్త్ర వ్యాపారంపై పన్ను విధించడంతో ఎక్కువ మంది వ్యాపారులు పన్ను రద్దు చేయమని కోరుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై పన్ను మినహాయింపు ఇవ్వడంవల్ల అవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ మంది ప్రజలకు మేలు కలగనుంది. గతంలో వ్యాట్ ఉన్నప్పుడు టర్నోవర్ పరిమితి 7.5 లక్షల వరకు పన్ను ఉండేది కాదు. ఇపుడు ఆ పరిమితిని 20 లక్షల వరకు పెంచడంవల్ల చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. ఒక శాతం పన్నుతో రూ.50 లక్షల టర్నోవర్ వరకు వ్యాట్‌లో అనుమతించేవారు. ఒక శాతం పన్నుతో నేడు 75 లక్షల టర్నోవర్ వరకు అనుమతించారు. ఇది కూడా వ్యాపారులకు ఊరటనిచ్చే అంశమే. అయితే ఇపుడు ఏ వ్యాపారం చేసినా వాటన్నింటినీ కంప్యూటరీకరించాల్సి ఉంది. గతంలో అకౌంటెంట్లు వాటిని కంప్యూటరీకరించేవారు. ఇపుడు అకౌంట్ బాధ్యత కూడా వ్యాపారులపై పడింది. నేడు వ్యాపారులకు సరిపడా అకౌంటెంట్లు కూడా లేరు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారికి ఇది ఇబ్బంది కలిగించే అంశం. అయితే వ్యాపారులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెనాల్టీ విధించకుండా ఒక ఏడాదిపాటు అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఇపుడున్న సర్వర్ సామర్థ్యం చాలకపోవడంవల్ల కేంద్రం కొన్ని రాష్ట్రాలకు అవసరమైతే మాన్యువల్ వేబిల్లు పొందడానికి అవకాశం కల్పించింది. వాణిజ్య పన్నుల శాఖ వ్యాపారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు విరివిగా సదస్సులు నిర్వహించాలి.
- జిఎస్ చలం,
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, విజయనగరం.