ఫోకస్

హోల్‌సేలర్లు కనుమరుగే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిఎస్టీలో పన్ను రేట్లు 12 శాతం, 18 శాతంగా ఉండడంవల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారుడు ప్రతినెలా రూ.4వేల వరకు పన్ను రూపంలో నష్టపోతాడు. వ్యాపార నిర్వహణలో భాగస్వాములైన ఏజెంట్లు, డీలర్లు, సబ్ డీలర్లు, సబ్ ఏజెంట్లు, హోల్‌సేలర్లు భారీగా నష్టపోయి దివాళాతీసి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో అమ్మకాలు, కొనుగోళ్లు జరపడం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుత ప్రాజెక్టులకు మినహాయింపులు ఎత్తివేయడం వల్ల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీఎస్టీ అమలు ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేవలం రెండు మూడు శాతం లాభాలతోనే వస్త్రాలు విక్రయిస్తారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినా లాభ శాతం తక్కువగానే ఉంటుంది. జీఎస్టీ వల్ల 50 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉంది. వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు కూడా తీవ్రంగా నష్టపోతారు. జీఎస్టీ అమలు కారణంగా ఔషధాల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఔషధాలపై ప్రస్తుతం వ్యాట్ 5 శాతం ఉండగా, జీఎస్టీలో 12 శాతంగా ఉంది. ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై వేయడానికి వీలులేదు. జీఎస్టీ అమలుతో రైల్వే చార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుతం టికెట్ ధరపై 4.5 శాతంగా ఉన్న సర్వీసు చార్జీ 5 శాతానికి పెరగనుంది. ఏసీ, ఫస్ట్‌క్లాస్‌లలో ప్రయాణించే వారికి కొంతమేర చార్జీల బాదుడు తప్పేలా లేదు.
- విబిఆర్ (వక్కలగడ్డ భాస్కరరావు)
ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్
కామర్స్ అండ్ ఇండస్ట్రీ, విజయవాడ