ఫోకస్

వస్త్రాలపై మొదటిసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్త్రాలపై ప్రభుత్వం పన్ను విధించింది. తయారీ దగ్గరినుంచి కొన్నవరకు అన్ని దశల్లోనూ జిఎస్టీ విధించడంవల్ల వస్తువుపై దాదాపు 50శాతం వరకు పన్నుపడే అవకాశం వుంది. వస్త్రాలపై పన్ను లేకుండా వత్తిడి తేవాలి. ఉత్పత్తి దశలోనే పన్ను వేయాల్సి వుంది. జిఎస్టీవల్ల అధికారుల వేధింపులు అధికమవుతాయి. ఒక షాపునుంచి మరోషాపునకు సరుకు తరలించాలంటే వేబిల్లు తప్పనిసరిగా వుండాలి. ఈ క్రమంలో పొరపాటున వేబిల్లు లేకుండా సరుకు రవాణా జరిగితే కేసులకు గురికావాల్సిందే. నెలవారీ అమ్మకాలపై ఐదు రకాల ఫారాలు నింపి కంప్యూటర్‌లో స్కేనింగ్‌ద్వారా అప్‌లోడ్ చేయాల్సి వుంది. కంప్యూటర్ లేకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం లేదు. 50వేలు పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్‌కి అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా తప్పనిసరిగా వేబిల్లు పొందాలి. ఇది ఒక ఊరి నుంచి మరొక ఊరికి మాత్రమే కాకుండా మనపక్క షాపులకు ఇవ్వాలన్న వేబిల్లు తప్పనిసరి. మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబరు క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతీ లావాదేవీ కంప్యూటర్‌ద్వారా జరుగుతాయి. కాబట్టి ఏదైనా అధికారి ద్వారాగానీ, జరిగిన పొరపాట్లను ఆఫీసుకి వెళ్ళి మార్చుకునే అవకాశంగానీ లేదు. తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమి చేయలేరు. ప్రతి నెలా 20వ తేదీన అప్‌లోడ్ చేసిన పిదప తదుపరి ఎలాంటి మార్పు, చేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అకాశం అసలే లేదు. అంతా కంప్యూటర్ మయమే కనుక 20వ తేదీన వేసే ఫైనల్ రిటర్న్ జాగ్రత్తగా వేయాలి. మొత్తం మీద జిఎస్టీ కత్తిమీద సామే. వస్త్రాలపై ఈ పన్నును రద్దు చేయకపోతే రాష్ట్రంలో 10 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడినవారు రోడ్డునపడే ప్రమాదం వుంది.
- బొమ్మన రాజ్‌కుమార్. ఉపాధ్యక్షుడు, ఎపి టెక్స్‌టైల్ ఫెడరేషన్