ఫోకస్

ధరలు తగ్గితేనే సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిఎస్టీవల్ల వినియోగదారునికి ధరలు, భారాలు తగ్గితేనే ఆ బిల్లుకు సార్థకత చేకూరుతుంది. కేంద్రం చెబుతున్నట్లుగా జిఎస్టీ వల్ల ధరలు తగ్గి వినియోగదారునికి లాభం చేకూరుందనే విషయాన్ని నిజం చేయాలి. జిఎస్టీ బిల్లుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, చాంబర్లు, మర్చంట్ అసోసియేషన్లు కలిసి అనేకచోట్ల వ్యాపారులు, వర్తకులకు అవగాహన సమావేశాలు నిర్వహించి వారికి చట్టం అమలుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిఎస్టీవల్ల 20 లక్షలలోపు టర్నోవర్ కలిగిన వ్యాపారులకు ఎటువంటి నష్టం ఉండరాదు. ముందుగా కేంద్రం అనుకున్న రెండు శ్లాబ్‌లు అమలు చేసినట్లయితే రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవి. ఇప్పుడు 6 శ్లాబ్‌లు చేయడంవల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా కేంద్రం అజమాయిషీ తగ్గుతుంది. జిఎస్టీ కేవలం దిగుమతి చేసుకున్న వస్తువులపైనే వేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభమే. ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలకు జిఎస్టీ వల్ల ఆదాయానికి చాలావరకు గండి పడుతుంది. ఈ విధానంద్వారా వ్యాపారునికి ఒక ఏడాదిపాటు గడువిచ్చి వాటిపై వచ్చే ఫిర్యాదులు, సలహాలను పరిష్కరించాలి. ఈ విధానంపై వ్యాపారి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. దీనివల్ల సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి. గతంలో పలు రకాల పన్నుల విధానంవల్ల వ్యాపారులు ఇబ్బందులు పడేవారు. ఈ ఏకీకృత వస్తు సేవా పన్ను విధానంతో వారికి శ్రమ తగ్గుతుంది. వ్యవస్థలో లోపాలను సవరించి వ్యాపారులు, అధికారుల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పాలి.
- దంటు సూర్యారావు
ఛైర్మన్, కోకనాడ ఛాంబర్
ఆఫ్ కామర్స్