ఫోకస్

అన్ని వర్గాలకూ మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం తీసుకువస్తున్న కొత్త పన్ను విధానం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయుక్తమైంది. 75 శాతం మంది ప్రజలకు ఈ జిఎస్‌టి వలన ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన ధనిక వర్గాలవారికి మాత్రమే జిఎస్‌టి వలన మరింత పన్నులు పడే అవకాశాలున్నాయ. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకువస్తున్న ఒకే పన్ను విధానం ఎంతో వినూత్నమైనది. అయితే కొద్దిరోజులపాటు వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. ఈ జిఎస్‌టి అమలుకు ప్రతి ఒక్క వ్యాపారి సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడమో, తానే నేర్చుకోవడమో చేయాల్సి ఉంటుంది. దీనివలన తొలుత కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన కేంద్రం 3 నెలలపాటు వ్యాపారుల వలన జరిగే చిన్న చిన్న పొరపాట్లకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని హామీనివ్వడం సంతోషించదగ్గ పరిణామం. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించగలిగి వ్యాపారాలు నిర్వహించుకునేవారు బహు అరుదు. దీంతో తప్పక సాంకేతిక సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాతస్టాక్‌ను అమ్ముకునే విషయంలోనూ 3 నెలల వరకు వెసులుబాటు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలి. దీనివలన వ్యాపారులకు కూడా మేలు చేసినట్లయింది. జిఎస్‌టి వలన ధరలు పెరిగిపోతాయంటూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విలాసవంత జీవితాన్ని అనుభవించే వారికి మాత్రమే సేవల విషయంలో పన్నుల బాదుడు ఉంటుంది.
- సన్నపురెడ్డి పెంచలరెడ్డి
ఉపాధ్యక్షుడు, ఏపి చాంబర్
ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్