ఫోకస్

విప్లవాత్మక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిఎస్‌టిపై చాలామందిలో భయాందోళనలు నెలకొని ఉండటంతో తొలుత చిన్న వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తల్లో అవగాహన, చైతన్యం కల్పించాలి. అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో ఐదుకోట్ల మంది చిన్న వ్యాపారులు, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరంతా జిఎస్‌టి పరిధిలోకి వచ్చేందుకు భయపడుతున్నారు. వీరేకాకుండా పెద్దతరహా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మరో 1.63 కోట్ల మంది ఉంటారని, ప్రస్తుతం దాదాపు 93 లక్షల మంది పన్నుల పరిధిలో కొనసాగుతున్నారని తెలుస్తోంది. జిఎస్‌టి 2017 జూలై 1 నుండి అమల్లోకి వస్తుండటంవల్ల దీనిపై ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనడంలో సందేహం లేదు. కుటుంబ నియంత్రణ లేదా కుటుంబ సంక్షేమంతోసహా ప్రభుత్వం చేపట్టే అనేక సామాజిక అంశాలపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. అదే విధంగా జిఎస్‌టిపై కూడా విస్తృతమైన ప్రచారం చేయాల్సి ఉంది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద అక్కడక్కడా ఒకరిద్దరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల చేత జిఎస్‌టి అమలుచేయించి, ఈ వివరాలను వీడియోద్వారా అందరికీ చూపించడంవల్ల భయాలు తొలగిపోతాయ. ప్రభుత్వం సోమవారం దాదాపు వంద అంశాలతో వివరణ ఇస్తూ, పత్రికల్లో ప్రకటన ఇచ్చినప్పటికీ, జనంలో సిందిగ్దస్థితి పోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల్లో ఎంతమంది జిఎస్‌టి పరిధిలోకి వస్తారో, ఎంతమంది రారో తేల్చాల్సి ఉంది. వాస్తవంగా జిఎస్‌టి పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం. దీని ఫలితాలు తక్షణమే వస్తాయని చెప్పలేము. దీర్ఘకాలికంగా దీనివల్ల సత్ఫలితాలే వస్తాయనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్సైజ్, విద్యుత్తు, నిర్మాణ రంగం తదితర రంగాలు జిఎస్‌టి పరిధిలోకి రాలేదు. పొగాకు, మిరప తదితర వాణిజ్యపంటలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చారు. పన్ను ఎగ్గొట్టే అలవాటు చాలాకాలంగా చాలామందిలో కనిపిస్తోంది. పన్ను చెల్లించకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాగుతాయి? ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలుగుతూ, తాము చేసే వ్యాపార, వాణిజ్య రంగాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చి, వ్యక్తిగతంగా ఉన్నతస్థాయికి చేరడమే కాకుండా, జాతీయ సంపదను పెంచేందుకు తోడ్పాటు అందించాలి.
- ఎస్. తిరుమలయ్య, ట్యాక్స్ కన్సల్టెంట్, పాస్ట్-ప్రెసిడెంట్, ఎఫ్‌టాప్సి