ఫోకస్

దీర్ఘకాలంలో మేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రానంతరం దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో వస్తు, సేవల పన్ను అమలు చాలా కీలకమైంది. చాలాకాలంగా దేశమంతటా ఒకే పన్ను విధానం అమల్లోకి తేవాలన్న ప్రయత్నం జూన్ 30 అర్ధరాత్రినుంచి అమల్లోకి రానుంది. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం. పన్ను విధింపు, వసూళ్లలో పారదర్శకత పెరుగుతుంది. జిఎస్‌టి అమల్లో తొలినాళ్లలో రాష్ట్రానికి కొంత మేర ఆదాయం తగ్గుతుంది. అయితే దీర్ఘకాలంతో ఇది మేలు చేస్తుంది. ఆదాయం నష్టపోయినప్పటికీ, దానిని భర్తీ చేసే ఏర్పాటు కూడా జిఎస్‌టి చట్టంలో ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి సెస్ వసూలు చేస్తారు. దాని నుంచి రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని కొన్ని ఇతర అంశాల ఆధారంగా చెల్లిస్తారు. తొలి సంవత్సరం రాష్ట్రానికి దాదాపు 2900 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. జిఎస్‌టి కౌన్సిల్‌లో ఎపి ప్రభుత్వం చేసిన వాదనల కారణంగా చాలా వస్తువులపై పన్ను తగ్గింది. ఇంకా మరికొన్ని వస్తువులపై పన్ను తగ్గించాల్సి ఉంది. వచ్చే సమావేశంలో కూడా వాటిపై చర్చ జరపుతాం. తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇతర దేశాలతో పోలిస్తే జిఎస్‌టి చాలా ఎక్కువగా ఉందన్న వాదన సరికాదు. దేశంలో ప్రాంతాల వారీగా వివిధ వస్తువుల ఉత్పత్తి, వాడకంలో తేడాలున్నాయి. 28 శాతం పన్ను శ్లాబ్‌లో కేవలం నాలుగు లగ్జరీ వస్తువులే ఉన్నాయి. అందువల్ల ఆ శ్లాబ్ వల్ల సామాన్యులపై ప్రభావం ఏమీ ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో జిఎస్‌టి అమలుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశాం. అమలుకు సంసిద్ధంగా ఉన్నాం. వ్యాపారులను అధికారులు వేధిస్తే, కఠిన చర్యలు తీసుకుంటాం. జిఎస్‌టి అమలుకు అన్ని వర్గాలు సహకరించాలి.
- యనమల రామకృష్ణుడు
ఎపి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి