ఫోకస్

అతిపెద్ద సంస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్నుల సంస్కరణల్లో ‘జిఎస్‌టి’ అతిపెద్ద సంస్కరణ. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నులుండాలన్నదే దీని ఉద్దేశం. ప్రపంచంలో అనేక దేశాల్లో జిఎస్‌టి అమలులో ఉంది. కొత్త విధానం కావడంవల్ల రెండు మూడు నెలలు కొంత సమస్య అనిపించవచ్చు. కొన్ని ఇబ్బందులు రావచ్చు కానీ ఈ విధానం ప్రయోజనాలను క్రమంగా గుర్తిస్తారు. జిఎస్‌టివల్ల ఏ వస్తువుల ధరల్లోనూ పెద్దగా తేడా ఉండదు. ఒకటి రెండు శాతానికి మించి ధరలపై ప్రభావం ఉండదు. జిఎస్‌టివల్ల తెలంగాణ ఆదాయం ఏ మాత్రం తగ్గదని భావిస్తున్నాం. గతంలో దేశవ్యాప్తంగా వేర్వేరుగా పన్నుల విధానం ఉండేది. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో కార్లు తయారు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో అమ్ముతారు. దీనివల్ల ఉత్పత్తి ప్రధానమైన రాష్ట్రాలకు పన్నుల ఆదాయం ఎక్కువగా ఉండేది. తెలంగాణ ప్రధానంగా వినియోగ ప్రధానమైన రాష్ట్రం. కొత్త విధానంవల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంకు దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. ముంబై నుంచే సేవా పన్ను చెల్లించేది. జిఎస్‌టివల్ల ఈ విధానానికి అవకాశం లేదు. ఆ బ్యాంకు ఏ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ రాష్ట్రంలోనే పన్ను చెల్లిస్తుంది. ఒకవేళ ప్రస్తుత పన్నుల విధానంతో వచ్చిన ఆదాయంకన్నా జిఎస్‌టివల్ల ఆదాయం తక్కువవస్తే రెండేళ్లవరకు కేంద్రం పరిహారం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం 15 శాతం మేరకు పన్నుల ఆదాయం పెంచుతూపోతారు. ఆదాయం తగ్గితే ఈ మేరకు పరిహారం చెల్లిస్తారు. అయితే తెలంగాణకు ఏమాత్రం ఆదాయం తగ్గదని, పరిహారం పొందే స్థితిలో ఉండదని భావిస్తున్నాం. పన్ను రిఫండ్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. అంతా ఆన్‌లైన్‌లోనే అయిపోతుంది. సెల్ఫ్ పోలీసింగ్ విధానం ఉంటుంది. ఇప్పుడు దేశంలో ఒక వస్తువు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత ఎంఆర్‌పిలో సైతం పెద్దగా తేడా ఉండదు. దేశమంతా ఒకే విధంగా ఉంటుంది. జిఎస్‌టి పన్నుల విధానంలో ఏమైనా అనుమానాలుంటే వాణిజ్య పన్నుల శాఖ అధికారులను సంప్రదించవచ్చు. దీనికోసం ఒక ప్రత్యేక ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఉంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జిఎస్‌టి దోహదం చేస్తుంది. జిఎస్‌టి అమలులోకి వచ్చాక ధరలు పెరుగుతాయని చెబుతూ కొందరు తమ అమ్మకాలు పెంచుకోవడానికి డిస్కౌంట్స్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ధరల్లో పెద్దగా తేడా ఉండదు. జిస్‌టి అలవాటు అయ్యేందుకు కొంత సమయం పడుతుంది .
- సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ