ఫోకస్

ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే జిఎస్‌టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంతా వస్తు సేవల పన్నుపైనే చర్చ జరుగుతోంది. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నా లేక మరొకరి నుండి ఏ రూపంలోనైనా సేవలు అందుకున్నా మనం కట్టే పన్నునే వస్తు సేవల పన్ను- జిఎస్‌టి అంటాం. తేడా ఏమిటంటే అందులో ఇతర రకాల పన్నుల భారం అంతా ఏకమైపోయి, మనం పన్నుమీద పన్ను చెల్లించాల్సిన భారం తగ్గిపోతుందనేది ప్రభుత్వం చెబుతున్న మాట. జిఎస్‌టిని ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల వరకూ అమలుచేస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, పాకిస్థాన్ కూడా దీనిని అమలుచేస్తున్నాయి. 1954లో ఫ్రాన్సులో మొదటిసారి జిఎస్‌టిని తీసుకువచ్చారు. కెనడాలో 1991లో దీనిని తీసుకువచ్చారు. తొలుత జిఎస్‌టిని 15 శాతంగా నిర్ణయించారు. దాంతో అక్కడ రెవిన్యూ వ్యవహారాల్లో గుర్తించదగిన మార్పులు వచ్చాయి. న్యూజిలాండ్‌లో 1986లో జిఎస్‌టిని తీసుకువచ్చారు. ముందు 10 శాతం అనుకున్నా తర్వాత మాత్రం 12.5 శాతానికి పెంచారు. ఇక్కడ కూడా వేగంగా ఆర్ధిక ముఖచిత్రం మారిపోయింది. ఆస్ట్రేలియాలో 2000 సంవత్సరంలో 10 శాతంగా జిఎస్‌టిని తీసుకువచ్చారు. దీనివల్ల ఆస్ట్రేలియా ఆర్థికరంగం కుదుటపడింది. భారత్‌లో కేల్కర్ టాస్క్ఫోర్సు-2004లో ఇచ్చిన ‘‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంట్’’ నివేదిక ప్రకారం జిఎస్‌టి అమలులోకి తెచ్చారు. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ఏకీకృతం చేయడం, కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరుగా కాకుండా ఒకే పన్ను వసూలుచేయడం, పన్ను- జిడిపి శాతాన్ని పెంచడం అలాగే పన్నుల ఎగవేతను నియంత్రించి అవినీతిని అడ్డుకోవడం జిఎస్‌టి ప్రధాన ఉద్ధేశ్యాలు. గతంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే జిఎస్‌టి ముసాయిదా తయారైనా దానిని పార్లమెంటు ఆమోదం పొందలేదు. దాంతో అమలులోకి రాలేదు, అయితే నేడు ఎన్‌డిఎ ప్రభుత్వం ఆ ముసాయిదాకు కొన్ని సవరణలు చేసి అమలులోకి తెచ్చింది. 2014లో తొలిసారి దీనిని పార్లమెంటు ముందుకు తీసుకువచ్చినా, గత మే నెలలోనే ఆమోదం పొందింది. వస్తు సేవల పన్ను గరిష్ట పరిమితిని 18 శాతానికి మించరాదని విపక్షాలు కోరుతున్నాయి. బిల్లులో ప్రతిపాదించిన ఒక శాతం అదనపు పన్నును ముఖ్యంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలపై విధించేందుకు వీలుకల్పించే నిబంధనను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. నిజానికి ఇలా అదనపు పన్ను అవసరమని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. వచ్చే పన్నులో మూడొంతులు రాష్ట్రాలకు ఒక వంతు కేంద్రానికి చెందాలని కూడా విపక్షాలు కోరుతున్నాయి. జిఎస్‌టి అమలులోకి వచ్చినా, నిజానికి దానిని సంపూర్ణంగా అమలుచేసే నైపుణ్యమైన అధికారులు సరిపడా లేరు. జిఎస్‌టి అమలుకు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞాన నెట్‌వర్కు అందుబాటులో లేదు. చిన్న చిన్న దుకాణాలవారు, షాప్‌లవారూ కంప్యూటర్లు లేకుండానే పనిచేస్తున్నారు. వారందరికీ తాజా పరిణామాలపై ఎలాంటి అవగాహన లేదు. కేంద్ర, రాష్ట్రాల వాటాపై ఇప్పటికే కేంద్రం సూచనప్రాయంగా చెప్పినా, దానిపై మరింత స్పష్టత రావల్సి ఉంది. కొన్ని రంగాలు జిఎస్‌టితో బాగా మెరుగుపడినా, మరికొన్ని రంగాలు ఘోరంగా దెబ్బతినే పరిస్థితి లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జిఎస్‌టిపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్‌లో.