రాష్ట్రీయం

సాంకేతిక పరుగుకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఆంధ్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఏపీ ఐటీ మంత్రి లోకేష్ దేశ రాజధానిలో బీజీ బీజీగా గడిపారు. కేంద్ర ఐటీ కమ్యూనికేషన్లు, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఐటీ సెక్రటరీ అజయ్ సహాని, ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్రలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ వృద్ధికి సహకరించాలని కేంద్రా న్ని కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీరంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీం (ఐబిపిఓ)లో ఆంధ్రకు ఇప్పటికే 4.5వేల సీట్లు కేటాయించారని, వాటికి అదనంగా మరో 2.7వేల సీట్లు కేటాయించాలని కేంద్రమంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు ఆమోదం
తెలపాలని రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. అలాగే కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ (సీ-డాక్)ను విశాఖలో త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్రం దీనికి సహకరించాలని రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఐడిటీకి కేంద్రం సహకారం అందించాలని కోరారు. ఉదయం మంత్రి లోకేష్ ఏపీ భవన్‌లో ఇండియన్ సెల్యూలర్ అసోషియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, ఇతర అసోషియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల ఏర్పాటుకు సహకరం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం ఏపీ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా అయిన తీసుకున్న సంస్కరణల నిర్ణయాల వల్లే భారత్ ఆర్థిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలుగువాడైన పీవీ ప్రధాని కావడం గర్వకారణమన్నారు.
చిత్రం.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమైన లోకేష్