అంతర్జాతీయం

పాక్‌పై నిందలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 28: ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందు వరసలో ఉందంటూ చైనా తన చిరకాల మిత్రదేశాన్ని గట్టిగా వెనకేసుకు వచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్, అమెరికాలు పాక్‌ను కోరిన ఒక రోజు తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని చైనా భావిస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ కృషికి ప్రపంచ దేశాలు పూర్తి గుర్తింపు, మద్దతు ఇవ్వాలి’ అని చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి లు కాంగ్ బుధవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరాటంలో పాకిస్తాన్ ముందు వరసలో ఉందని, ఈ విషయంలో ఎంతో కృషి చేస్తోందని మేము చెప్పాల్సి ఉంటుంది’ అని అన్నారు. సీమాంతర ఉగ్రవాదం కోసం తమ భూభాగాన్ని వాడుకోవడానికి అనుమతించవద్దని భారత్, అమెరికాలు సంయుక్త ప్రకటనలో పాక్‌ను కోరడం తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా లు కాంగ్ ఈ విషయం చెప్పారు. ముంబయి, పఠాన్‌కోట్ ఇతర సీమాంతర ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించాలని కూడా మంగళవారం మోదీ-ట్రంప్ చర్చల అనంతరం విడుదల చేసిన ఆ ప్రకటనలో కోరిన విషయం తెలిసిందే.
కాగా, మోదీ-ట్రంప్ చర్చలు, భారత్-అమెరికా సంబణదాల మెరుగుదల అంశాలపై అడిగిన ప్రశ్నలకు లు కాంగ్ సమాధానమిస్తూ దేశాలు తమ స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపర్చుకోవడం చైనాకు కూడా సంతోషమేనని అన్నారు. భారత్-అమెరికా స్నేహ సంబంధాలు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల పరిరక్షణకు దోహదపడుతాయని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. అఫ్గాన్‌స్థాన్ సుస్థిరతలో నారత్ పాత్రను అమెరికా గుర్తించడం గురించి అడగ్గా, అఫ్గాన్‌లో శాంతి ప్రక్రియ ఆ దేశ నేతృత్వంలోనే జరగాలని తాము మొదటినుంచీ చెప్తున్నామని, ఈ దిశగా అన్ని పక్షాల నిర్మాణాత్మక కృషిని సైతం తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.