జాతీయ వార్తలు

విక్రయానికి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: అప్పుల ఊబిలో కూరుకు పోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ఎంత వాటాను విక్రయించాలనే దానితో పాటుగా ఇతర విధి విధానాలను మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రివర్గ సమావేశం వివరాలను తెలియజేశారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని జైట్లీ చెప్పారు. అయితే ఎంతవాటాను విక్రయించాలనే దానితో సహా దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడానికి మంత్రుల బృందం (జిఓఎం)ను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా అప్పులు ఇప్పటికే రూ. 52 వేల కోట్లకు చేరుకున్నాయి. 2012లో అప్పటి యుపిఏ ప్రభుత్వం ప్రకటించిన రూ. 30 వేల కోట్ల బెయిలవుట్ ప్యాకేజిపైనే ఈ సంస్థ ఇప్పటికీ మనుగడ సాగిస్తోంది. కాగా, ఎయిరిండియా అప్పులు తలకు మించిన భారంగా మారిపోయాయని, దీన్ని పూర్తిగా ప్రైవేటీకరించక తప్పదని నీతి ఆయోగ్ సైతం ఎప్పుడో స్పష్టం చేసింది. మరోవైపు ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు రోడ్‌మ్యాప్‌ను సైతం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
కాగా, బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సులపై ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలియజేశారు. 34 మార్పులతో ఏడవ వేతన సంఘం సిఫార్సులకు ఆమోదం తెలియజేసినట్లు జైట్లీ చెప్పారు. జూలై 1నుంచి ఉద్యోగులకు సవరించిన అలవెన్సులు లభిస్తాయని ఆయన తెలిపారు. బుధవారం కేంద్రమంత్రివర్గం అలవెన్సులపై తుది నిర్ణయం తీసుకున్నందున జూలై నెల వేతనాలతో ఉద్యోగులకు కొత్త అలవెన్సులు లభించవచ్చని భావిస్తున్నారు. పెంచిన అలవెన్సులను అమలు చేయడంతో ప్రభుత్వ ఖజానాపై రూ.30,748 కోట్ల అదనపు భారం పడనుంది.
అలవెన్సులపై లావాసా కమిటీ సిఫార్సులను పరిశీలించడం కోసం ఏర్పాటు చేసిన కార్యదర్శుల సాధికారిక కమిటీ ఇప్పటికే తన ప్రతిపాదనలను కేంద్రమంత్రివర్గానికి సమర్పించింది. ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ గత ఏప్రిల్ 27న తన నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించింది. అయితే నగరాల స్థాయి ఆధారంగా ఇంటి అద్దె అలవెన్సును 2నుంచి 6 శాతం దాకా తగ్గించాలంటూ ఎకె మాధుర్ నేతృత్వంలోని ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సులకే కార్యదర్శుల స్థాయి సాధికారిక కమిటీ మొగ్గు చూపింది. ఎక్స్, వై, జడ్ కేటగిరీ నగరాలకు వరసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం ఇంటి అద్దె అలవెన్సులను మాధుర్ నేతృత్వంలోని ఏడవ వేతన సంఘం ఇంతకు ముందు ప్రతిపాదించింది. అంతేకాకుండా కరవు భత్యం (డిఏ) 50 శాతాన్ని దాటినప్పుడు ఇంటిఅద్దె అలవెన్సును 27 శాతం, 18శాతం, 9 శాతానికి సవరించాలని, అలాగే 100 శాతానికి దాటినప్పుడు 30 శాతం, 20 శాతం, పది శాతానికి సవరించాలని కూడా వేతన సంఘం సిఫార్సు చేసింది. అలాగే సియాచిన్ ప్రాంతంలో విధులు నిర్వహించే సైనికులకు ఇచ్చే అలవెన్సును, ప్రతికూల పరిస్థితుల్లో పని చేస్తున్న ఉద్యోగుల అలవెన్సును కూడా పెంచారు. పెన్షనర్లకు ఇచ్చే మెడికల్ అలవెన్సును 500నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. వందశాతం వైకల్యం ఉండే పెన్షనర్లకు కాన్‌స్టంట్ అటెండెన్స్ అలవెన్సును కూడా భారీగా పెంచారు. ఆస్పత్రుల్లో పని చేసే నర్సులు, ఇతర సిబ్బంది అలవెన్సును, అలాగే ఆపరేషన్ థియేటర్ అలవెన్సును కూడా పెంచుతూ ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సులకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది.