రాష్ట్రీయం

ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణలో ఇకపై బోర్‌బావుల మరణాలు లేకుండా చూస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. బోర్‌బావుల తీరుతెన్నులపై పంచాయతీరాజ్, రెవెన్యూ, భూగర్భ జలశాఖ అధికారులతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోర్‌బావుల్లో పడి చిన్నారులు మరణిస్తుండటం తన మనస్సును కలిచివేసిందని, భవిష్యత్తులో అలాంటి మరణాలు ఉండకూడదన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో బోరుబావులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా బోరుబావి తవ్వి, నీరు ఉన్నా లేకున్నా అలాగే వదిలేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నీళ్లు పడకపోతే సదరు బోరుబావిని మూసేయాలని, నీళ్లుపడితే వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. బోరుబావి పూడ్చకపోతే 50వేల రూపాయల వరకూ జరిమానా విధించాలని, ఇందుకు అనుగుణంగా తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈ బాధ్యతను సర్పంచ్, గ్రామకార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారికి అప్పగించాలన్నారు. సర్వే సమయంలోనే బోరువేసిన యజమానులతో చర్చించి, వాటిని పూడ్చివేయాలని సూచించారు.
అనుమతిలేని రిగ్స్‌ను సీజ్ చేయాలని, జరిమానా కూడా విధించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా 350 రిగ్స్‌కు మాత్రమే అనుమతి ఉందని ఆయన గుర్తుచేశారు. ఎక్కడైనా బోర్ వేయాల్సి వస్తే 15 రోజుల ముందు అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా బోర్ వేస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, భూగర్భజలశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎట్టిపరిస్థితిలోనూ బోర్‌వెల్స్ ఓపెన్‌గా ఉండేందుకు వీలులేదన్నారు. సమావేశంలో రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బిఆర్ మీనా, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.