రాష్ట్రీయం

తొలగిన అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు సంబంధించి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. ప్రాజెక్టు మొదటి దశ కింద ఇరిగేషన్ లేదా మంచినీటి కోసం వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని ధృవీకరించేందుకు నేషనల్ గ్రీన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం విచారించి ఆదేశాలిచ్చింది. కాగా కమిషన్‌లో సాగునీటి రంగ నిపుణులు లేనందువల్ల కమిషన్ ఏర్పాటు సబబుకాదని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఏడాది మే 30న ఎన్‌జిటి ఇండిపెండెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు వెలువరించడం తెలిసిందే. బి హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జిటి ఈ ఆదేశాలను ఇచ్చింది. పర్యావరణ, అటవీ శాఖలు అనుమతిలేకుండా 279 హెక్టార్ల అటవీ భూముల్లో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ హర్షవర్దన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హర్షవర్దన్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఎన్‌జిటి 22వ సెక్షన్ కింద ట్రిబ్యునల్ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేయాలని, హైకోర్టులో కాదని తెలిపారు. కాగా ఎన్‌జిటి తదుపరి ఆదేశాల్లో కమిషన్‌లో ఇరిగేషన్ రంగ నిపుణుడిని నియమించే వరకు తాము ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-1 పరీక్షపై పిటిషన్ స్వీకరించిన హైకోర్టు
గత ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి ప్రకటించిన ప్రొవిజనల్ లిస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ నిమిత్తం స్వీకరించింది. డి శ్రీకాంత్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు స్వీకరించారు. కేసులో పిటిషనర్ల తరఫున న్యాయవాది బి రచనారెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు.
ఆన్‌లైన్ రమీపై..
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు తెలంగాణ రాష్ట్రం వెలుపల నుంచి ఆన్‌లైన్ రమీ గేమ్‌ను నిర్వహణకు అనుమతించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 17న ఆన్‌లైన్ రమీ గేమ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అనంతరం ఈ కేసులో వచ్చే సోమవారం ప్రభుత్వ వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.