జాతీయ వార్తలు

వౌనం వీడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: సామూహిక హత్యాకాండలు, మతపరమైన దాడులు సహా ఇటీవల జరిగిన అనేక దురంతాలపై పౌర సమాజం కనె్నర్ర చేసింది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీసహా అనేక నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లో వేలాది మంది పౌరులు పాల్గొన్నారు. ‘నాట్ ఇన్ మై నేమ్’ (పేరే నేరమా) అన్న నినాదంతో మొదలై ప్రచారం విస్తృత స్థాయిలో ప్రజా చైతన్య ప్రదర్శనగా మారింది. ఢిల్లీలో వేలాది మంది పౌరులు జంతర్‌మంతర్‌లో జరిగిన ఓ భారీ నిరసన ప్రదర్శనలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ‘వౌనం వీడండి’.. ఇస్లామోఫోబియాకు స్థానం లేదు’ వంటి అనేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఓ శాంతియుత లక్ష్యంకోసం ప్రజలందరూ ఉమ్మడిగా ముందుకు రావాలన్న ఆలోచనతోనే ఈ ప్రదర్శన నిర్వహించామని నిరసనకారులు తెలిపారు. ఈ నెల 22న ఢిల్లీ రైల్లో దారుణ హత్యకు గురైన 17 సంవత్సరాల జునాయిడ్ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీట్ల విషయంలో చెలరేగిన వివాదం ఆ హత్యకు దారితీసింది. గోహత్యకు పాల్పడ్డాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో కొందరు వ్యక్తులు ఓ ముస్లింపై దాడికి పాల్పడ్డారు. జునాయిద్ హత్య అనంతరం సినీ దర్శకుడు సబా దేవన్ తన ఫేస్ బుక్‌లో మొదలు పెట్టిన ‘నా పేరుతో కాదు’ అన్న నిదానం ఒక్కసారిగా ఊపందుకుంది. ముంబయిలోని బాంద్రాలో జరిగిన ప్రదర్శనలో షబానా ఆజ్మీ, రజత్ కపూర్, మీడియా కార్యకర్త అప్రిత చటర్జీ తదితరులు పాల్గొన్నారు. ఇవి మామూలు సంఘటనలు కాదని, వాటిని విస్మరించడానికి వీల్లేదని షబానా ఈ సందర్భంగా అన్నారు. ఇలాంటి వాటికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కోల్‌కతాలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న అపర్ణాసేన్ ‘ఏ మతస్థులపై జరిగినా ఇలాంటి దాడులను ఖండించాల్సిందే’నని పిలుపునిచ్చారు. అలహాబాద్, బెంగళూరు, చండీగఢ్, జైపూర్, కొచ్చి,లక్నో, పాట్నా, తిరువనంతపురంలో కూడా ఈ ప్రదర్శనలు జరిగాయి.