జాతీయ వార్తలు

అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: మాంసంకోసం అక్రమంగా పశువిక్రయం చేయటంపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అకిల భారత కిసాన్ సభ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ నోటిఫికేషన్ దేశంలో మత స్వేచ్ఛ, స్వేచ్ఛా రవాణ హక్కులను కూడా కాలరాస్తోందని ఆ పిటిషన్‌లో పేర్కొంది. గో పరిరక్షణ పేరుతో ఇటీవల దళితులపై దాడులు చేస్తున్నవారికి ఈ నోటిఫికేషన్ మరింత బలాన్నిస్తోందని విమర్శించింది. ‘రాజ్యాంగంలోని 25వ అధికరణం దేశంలో ఎవరైనా తమకు ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించవచ్చని పేర్కొంటోంది. ఇది ప్రాథమిక హక్కు కూడా. జంతువులను మత ప్రయోజనాలకోసం బలిస్తారు. ఈ రకమైన నోటిఫికేషన్ విడుదల చేయటం ద్వారా వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛను కేంద్రం హరిస్తోంది’ అని కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు. రాజ్యాంగం పౌరులకు ఇస్తున్న హక్కులు, ఆర్థికంగా జరుగుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని తమ పిటిషన్‌ను విచారించాలని సుప్రీం కోర్టును కోరినట్లు హన్నన్ తెలిపారు.