జాతీయ వార్తలు

కోవింద్ నాలుగో నామినేషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్టప్రతి పదవికి ఎన్‌డిఏ తరపున పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్ తరపున నాలుగో నామినేషన్ దాఖలైంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన ఈ నామినేషన్‌ను లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి బలపరిచారు. వెంకయ్యనాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, మేకపాటి రాజమోహన్ రెడ్డి మరికొందరు నాయకులు బుధవారం రాష్టప్రతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనూప్ మిశ్రాకు పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వెంకయ్య నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ అధికార అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అత్యంత సునాయసంగా రాష్టప్రతి పదవిని గెలుచుకుంటారని చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్‌డిఏ మిత్రపక్షాలైన ముప్పై మూడు పార్టీలతోపాటు ఐదు ఎన్‌డియేతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వటం ముదావహమని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలోని జె.డి(యు), తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నాయకత్వంలోని అన్నా డిఎంకె రెండు వర్గాలు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సిపిలు రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయని అన్నారు. రామ్‌నాథ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని మేకపాటి చెప్పారు. కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరిచే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.