ఐడియా

ఈ చిట్కాలతో మధుమేహానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు పాటించే ఆహార ప్రణాళికలతోపాటూ కొన్నిరకాల పండ్లు తింటే రక్తంలోని చక్కెరస్థాయిలు తగ్గటమే కాకుండా, కొవ్వు కరగటం, ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అన్ని రకాల పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. కానీ, తినే పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మేరలో ఉందో చూసుకోవాలి.
ఆరెంజ్
నారింజ పండు అని గుర్తురాగానే మొదట గుర్తొచ్చేది విటమిన్ సి. అంతేకాదు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్‌న కలిగి ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను, కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. వీటితో పాటుగా విటమిన్ ఎ, సంక్లిష్ట విటమిన్ బి వంటి అనేక విటమిన్‌లను పుష్కలంగా ఉంది. ఇది మధుమేహులకు అన్ని రకాలుగా సహాయపడుతుంది.
ఆపిల్
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన పండుగా దీనిని పేర్కొనవచ్చు. తక్కువ గ్లైసిమిక్ విలువలతోపాటుగా, పెక్టిన్‌ను సమృద్ధిగా కలిగి ఉంటుంది. వీటిలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెరలను, కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు త్వరగా ఇన్‌ఫెక్షన్‌లకు గురవుతుంటారు. ఆపిల్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు ఇన్‌ఫెక్షన్‌లకు దూరంగా ఉంచుతాయి.
ద్రాక్షపండ్లు
ఆరోగ్యకర బరువు, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించటంతో పాటు వీరి చికిత్సలో ముఖ్యమైన సమ్మేళనంగా పేర్కొనే ‘నారినే్జనిన్’ అనే సమ్మేళనం ద్రాక్షపండులో ఉన్నాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండే ఈ పండు రక్తప్రసరణను మెరుగుపరచటం, కొవ్వు పదార్థాలను తగ్గించటం, క్యాన్సర్ వ్యాధిని నివారించటం వంటివాటిని చేస్తుంది.