భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందా భగవాన్‌దాస్, శాలిబండ, హైదరాబాద్
ప్ర:మతమంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం కదా! కొన్ని మతాలలో ఉగ్రత్వమూ, క్రూరత్వమూ ఎందుకు చోటుచేసుకుంటున్నాయి?
సమా:్భగవంతుని పట్ల కేవలం విశ్వాసాన్ని మాత్రమే ప్రబోధించే మతాలలో అటువంటి అవలక్షణాలు కనిపిస్తాయి. భగవంతుని పట్ల విశ్వాసంతో పాటు భక్తి కూడా ఉండాలి. భక్తితత్వం కారణంగా మనిషిలో సాత్వికత్వం, ప్రేమ, వినయమూ చోటుచేసుకుంటాయి. ఆ కారణంగానే హిందూత్వంలో భక్తివిశ్వాసాలు, జ్ఞాన వైరాగ్యాలు బోధించారు. అనంత జ్ఞానాన్ని ప్రబోధించే మహాభారతాన్ని వ్రాసిన వ్యాసులవారు కూడా అసంతృప్తులై ఉంటే భక్తి ప్రధానమైన భాగవతాన్ని వ్రాయమని ఉపదేశించాడు నారదుడు. అందుకే భగవంతుని పట్ల భక్తితో కూడిన విశ్వాసం ఉండాలి. వైరాగ్యం, నిస్పృహ వల్లనో, నిరాశవల్లనో కాకుండా జ్ఞానంతో కూడిన వైరాగ్యం ఉండాలి. భక్తి విశ్వాసాలు- జ్ఞాన వైరాగ్యాలు మోక్షప్రాప్తికి సోపానాలు.
చాట్ల వెంకట రమేష్, చామకుర్తి, ప్రకాశం (ఆంధ్ర)
ప్ర:నాది జ్యేష్ఠా నక్షత్రం 4వ పాదం- వివాహం ఎప్పుడు?
సమా:జ్యేష్ఠా నక్షత్రం శాంతి నక్షత్రం- నాల్గవ పాదం అంటే మూలా నక్షత్ర ప్రభావమూ ఉంటుంది. జన్మ సమయంలో పటిష్టమైన శాంతి దానాదులు చేసారా? విచారించండి. వివాహానికి ఇంకా ఆలస్యం ఉంది.
హెచ్.నరసారెడ్డి, ఆదోని (కర్నూలు)
ప్ర:పునర్వివాహం అవకాశం ఉందా? ఉద్యోగం కొత్తది వస్తుందా?
సమా:మీరు వ్రాసిన వివరాల ప్రకారం భిన్న సంప్రదాయాల విషయంలో అనుమానిస్తున్నట్టున్నారు. సంశయంతో ఏ పని చేయటమూ మంచిది కాదు. అందులోనూ గతానుభవాలు బాగా లేవంటున్నారు. కనుక విరమించుకోండి. నూతన ఉద్యోగం కాని ప్రమోషన్ కాని ఆలస్యాన్ని సూచిస్తోంది.
ఎమ్.శివప్రసాద్, బేతంచర్ల, కర్నూలు
ప్ర:కుటుంబంలో గొడవలు- స్థిరనివాసం (స్వంత యిల్లు) లేదు- మనశ్శాంతి లేదు. ఏమి చేయాలి?
సమా:మొట్టమొదటగా మీరు గుర్తించవలసినది- గొడవలు లేని కుటుంబాలంటూ లేవు. ఓర్పుతో, నేర్పుతో నెట్టుకు రావాలి. మీకు 25 సంవత్సరాలు అంటున్నారు.
మహావాది సత్యనారాయణ, తెనాలి, గుంటూరు
ప్ర:రెండవ అబ్బాయికి ఉద్యోగం వస్తుందా?మఖా నక్షత్రం- రెండవ పాదం
సమా:సంఖ్య మీరు చెప్పవలసినది కాదు. రాశి ప్రకారం ప్రస్తుతం అర్థాష్టమ శని ఉంది. ఆగస్టు తరువాత అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిష్కార నివారణ- పరమేశ్వరునికి ప్రతి సోమవారం పంచామృతాభిషేకం చేయించండి.
వోడ్నాల ప్రసాద్, జాలపల్లి (తెలంగాణ)
ప్ర:మా బాబుకి రిత్విక్ అని పేరు పెట్టాం. సరిపోతుందా?
సమా:‘రి’ బదులు ‘రా’ వచ్చేపేరు ఎనునకోండి. ‘రి’ ధనహీనాంశ అవుతుంది. ‘రా’ విజయాంశ అవుతుంది.
వి.రవీంర్‌రెడ్డి, సంగడిగుంట (గుంటూరు)
ప్ర:గురువుగారూ! మీరు నాకు ప్రభుత్వోద్యోగ యోగం ఉందన్నారు. మీ మాట అక్షరాలా నిజమయ్యింది. నేను గ్రూప్-2, గ్రూప్-3 రెండింటిలో మెయిన్స్ సెలెక్ట్ అయ్యాను. నాకు ఏది లభించగలదు.
సమా:గ్రూప్-2లోనే పూర్తి అవకాశాలు ఉన్నాయి.
సిహెచ్.హృషీకేశ్‌రావు- చిన్నగానుగపాలెం- ప్రకాశం
ప్ర:గురువుగారూ! నాకు జీవితంలో స్థిరత్వం లేదు. నా జాతక చక్రం పంపిస్తున్నాను- దోషం చెప్పండి.
సమా:మీకు జాతకంలో చంద్ర-రాహువుల సంయోగ దోషం ఉంది. ఈ రెండూ చంచలాత్వానికి కారణాలు- జాక్ ఆఫ్‌ఆల్ మాస్టర్ నన్ అన్న పద్దతిలో మీ జీవితం సాగిపోతోంది. ఎవరైనా సిద్ధపురుషుని ఆశ్రయించి సరస్వతీ మంత్రోపదేశం పొందండి.
పావాడ గణపతిరావు - విజయనగరం (ఆంధ్ర)
ప్ర:అనారోగ్య కారణాలు- తగ్గగలవా?
సమా:తల- గొంతు- మీకు అనారోగ్యస్థానాలు. తగిన చికిత్స పొందండి. తగ్గుతాయి. సాధ్యమైనంత వరకూ గొంతుకు విశ్రాంతి ఇవ్వండి. వీలయితే ఒకరోజు పూర్తిగా వౌనం పాటించండి.
ఎమ్.చరిత, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర:డిగ్రీలో ఎమ్.ఇ.సి తీసుకున్నాను. బాగుంటుందా?
సమా:మీకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అయితేనే బాగుండేవి. లెక్కలు అంతగా యోగించవు.
ఎమ్.బి.కృష్ణమూర్తి, తుని (ప.గో.)
ప్ర:మనశ్శాంతి కోసం ఏం చేయాలి?
సమా:ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే ఒక అధ్యాయం చొప్పున భగవద్గీతా పారాయణం తాతర్పర్య సహితంగా చదివి శ్రీకృష్ణ భగవానుని ముందు దీపం వెలిగించండి.
పి.సూర్యకాంతం- తాడేపల్లి గూడెం (ఆంధ్ర)
ప్ర:వివాహితుడు- సంతానవంతుడూ అయిన నా కుమారుడు ఇల్లు విడిచి పోయి మూడు సంవత్సరాలు దాటింది. ఎప్పుడు రాగలడు?
సమా:ఉత్తర దిశకు పోయినాడు. 2018 చివరి భాగంలో మీకు జాబు రాగలదు.
శైలజ, హిందూపురం - (ఆంధ్ర)
ప్ర:్భర్తగారి గురించి?
సమా:ప్రతి శుక్రవారం పసుపురంగు వస్తమ్రులు- పసుపు రంగు తిలకమూ ధరించి జగన్మాతను పూజించండి. సమస్య పరిష్కారం అవుతుంది (పసుపు రంగు పూలతో). పసుపు రంగు నైవేద్యం అంతా పసుపుమయంగా ఉండాలి.
ఎన్.చలపతి, సోమందేపల్లి, అనంతపురం
ప్ర:పట్టుచీరల వ్యాపారం అభివృద్ధికి ఏం చేయాలి?
సమా:తిరుచానూరు పద్మావతిదేవీకి ప్రతి సంవత్సరం శుక్రవారం రోజున పట్టుచీరలు (రెండు) పట్టు రవికలు (రెండు) సమర్పించటం వ్రతంగా పెట్టుకోండి.
మేడాప్రసాద్ - ఆర్యవైశ్యసత్రం (కర్నూలు)
ప్ర:అహోబిలంలో ఆర్యవైశ్య సత్రం క్రొత్తది నిర్మాణానికి ఆటంకాలు వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి.
సమా:కాణీపాకం వినాయకస్వామి సన్నిధిలో తగు సంకల్పంతో నాలుగు సోమవారాలు అధర్వశీర్ష గణపతి హోమం జరిపించండి. శుభం జరుగును.
వి.మనోజ్, బెంగుళూరు - కర్నాటక
ప్ర:దాంపత్య సమస్యలు- మా ఇరువురి జాతకాల పరిశీలించండి?
సమా:మీ జాతకంలో సప్తమ స్థానం పూర్తిగా పాపగ్రస్తమైంది. జన్మలగ్నంలో కూడా శతృకారక స్ర్తి విరోధ దోషం ఉంది. తగు నివారణలు పాటించండి. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.
పి.సి.ఎమ్, కొత్తపేట (తూ.గో.జి)
ప్ర:అనాయాస మరణం పొందే యోగ్యత ఉన్నదా?
సమా:చావు పుట్టుకలు మన చేతిలో లేవు. మరణాదులు అడగకూడదు- చెప్పకూడదు అని జ్యోతిషశాస్త్ర నియమం.

వి.సత్యఅరుణ, విశాఖపట్టణం (ఆంధ్ర)
ప్ర:ఉద్యోగ యోగం?
సమా:మీలో ప్రతిభ ఉంది. అందుకు సరియైన విద్యార్హతలు- బహుముఖ ప్రావీణ్యత ఉంది. ఉద్యోగం కోసం తాపత్రయపడకుండా ప్రైవేటు కోచింగ్ సెంటర్ పెట్టుకోండి. పదిహేను సంవత్సరాల మీ అనుభవం సరిగా ఉపయోగించుకోండి.
పలచోళ్ళ శ్రీరామమూర్తి, గెద్దెనపల్లి (తూ.గో.)
ప్ర:ఉబ్బసవ్యాధి నయమవుతుందా?
సమా:ఆయుర్వేదంలో ‘వాసకంటకారి లేహ్యం’ వాడి చూడండి. హైదరాబాద్‌లో చేప మందు కూడా ప్రయత్నించండి. చాలా ప్రసిద్ధమైనది.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ