ఆటాపోటీ

డేగ కాపలా! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వింబుల్డన్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అక్కడికి పావురాలు రాకుండా చూసేందుకు ప్రత్యేక శిక్షణనిచ్చిన ‘రఫుస్’ అనే డేగ కాపలా కాస్తున్నది. దీనికి ఒక ట్విటర్ అక్కౌంట్ కూడా ఉంది. ట్విటర్ ఫాలోయింగ్‌లో రఫుస్‌తో మాగీ మే తీవ్రంగా పోటీపడుతున్నది. ఇంతకీ మాగీ మే అనేది పక్షికాదు.. ఆండీ ముర్రే పెంచుకుంటున్న కుక్క పేరు ఇది. ట్విటర్‌లో దీనికి సుమారు 27,000 మంది ఫాలోయర్లు ఉన్నారట.
తాజా గాలి!
* టాప్ సీడ్స్ మధ్య జరిగే మేజర్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌కు కూడా ఆతిథ్యమిచ్చే సెంట్రల్ కోర్టులో 14,979 సీట్లు ఉన్నాయి. బయట నుంచి దుమ్మూ, ధూళి రాకుండా జాగ్రత్త పడుతూ, సెకనుకు ఎనిమిది లీటర్ల పరిమాణంలో తాజా గాలిని స్టేడియంలోకి పంపిస్తారు. అంతేగాక, ఫ్రెష్ ఎయర్ బ్యాగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. ఉష్ణ తాపం తెలియకుండా ఉండేందుకు 9 చిల్లెర్ యూనిట్ల శక్తిని వినియోగిస్తారు.

అనాథలకు సాయం
* అనాథలకు సాయం అందించడానికి వింబుల్డన్ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. అదే విధంగా ప్రజాహితం కోసం టాస్‌ను వేసేందుకు ఒక మొత్తాన్ని కేటాయించి, దానిని ట్రస్టులకు విరాళంగా అందచేస్తుంది. నిరుడు మహిళల ఫైనల్‌కు 11 సంవత్సరాల ఉమా బాకెర్ బెహల్‌తో టాస్ వేయించారు. పురుషుల ఫైనల్‌కు 11 ఏళ్ల యూసుఫ్ మాజ వేశాడు. వీరిద్దరూ ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న వారే.

ప్రత్యేకతలతో పైకపు!
* భారీ వర్షం కురిసినప్పుడు, ప్రేక్షకులు తడవకుండా ఉండేందుకు పైకప్పును మూసేస్తారు. వింబుల్డన్ సెంట్రల్ కోర్టు రూఫ్‌ను పూర్తిగా మూసేయడానికి సుమారు పది నిమిషాల సమయం పడుతుంది. ఇది కోర్టుకు సరిగ్గా 16 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒకసారి రూఫ్‌ను మూసేసిన తర్వాత, వర్షం కారణంగా అంతకు ముందు నిలిచిపోయిన మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించడానికి సుమారు అర గంట సమయం పడుతుంది. ఈలోగా స్టేడియం లోపల వాతావరణం ఆటకు అనువుగా మార్చేస్తారు. మూసివేయడానికి వీలున్న ఈ రూఫ్ వ్యాసం 77 మీటర్లు. బరువు 3,000 టన్నులు. దీనిని తిరిగి వినియోగించడానికి వీలున్న లోహాలు, పదార్థాలతో తయారు చేశారు.

- సత్య