ఆటాపోటీ

నవ్రతిలోవా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో అత్యధిక ట్రోఫీలను మార్టినా నవ్రతిలోవా గెల్చుకుంది. ఆమె మొత్తం తొమ్మిది పర్యాయాలు వింబుల్డన్‌లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఆమె మొత్తం 12 పర్యాయాలు ఫైనల్ చేరింది. 1982 నుంచి 1990 వరకూ వరుసగా తొమ్మిది సంవత్సరాలు ఆమె ఫైనల్ చేరడం ద్వారా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక, మహిళల డబుల్స్‌లో ఏడు పర్యాయాలు, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో నాలుగు సార్లు ఆమె వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో అత్యధిక టైటిళ్లు కైవసం చేసుకున్న రికార్డును విలియమ్ రెన్షా, పీట్ సంప్రాస్, రోజర్ ఫెదరర్ పంచుకుంటున్నారు. వీరంతా తలా ఏడుసార్లు టైటిల్‌ను అందుకున్నారు.
మహిళల డబుల్స్‌లో మొదటి టైటిల్‌ను విన్‌ఫ్రెడ్ మెక్‌నైర్, డోరా బుత్‌బై జోడీ కైవసం చేసుకుంది. మొదటి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను హోప్ క్రిస్ప్, ఏంజెస్ టకీ జోడీ సాధించింది.