ఆటాపోటీ

ఎన్నో జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యాచ్‌లు ఆడే బంతులు సరైన ఆకారంలో ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఏడు నుంచి తొమ్మిది గేమ్‌లకు బంతిని మారుస్తారు. బంతుల ఆకారం చెదరకుండా ఉండేందుకు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతారు. వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభమైన కొత్తల్లో తెల్లని బంతులు వాడేవారు. అయితే, టీవీలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు తెల్ల బంతులు సరిగ్గా కనిపించేవి కావు. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు 1986లో పసుపు రంగు బంతులను ప్రవేశపెట్టారు. టోర్నీ మొత్తంలో 54,250 బంతులను వాడతారు. ప్రతి బంతినీ ర్యాకెట్‌తో నేలపై కొడుతూ, బౌన్స్ సక్రమంగా ఉందా లేదా అని పరీక్షిస్తారు. ఏమాత్రం తేడా కనిపించినా ఆ బంతిని పక్కకు పడేస్తారు.
బిబిజిలకు శిక్షణ: టెన్నిస్ మ్యాచ్‌ల్లో బంతులు దూరంగా పడినప్పుడు వాటిని తెచ్చుకోవడం ఆటగాళ్లకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే బాల్ బాయిస్, గర్ల్స్ వాటిని అందించేందుకు సిద్ధంగా ఉంటారు. వీరినే బిబిజిలు (బాల్ బాయిస్ అండ్ గర్ల్స్)గా పేర్కొంటారు. ఎంతో వేగంగా దూసుకెళ్లే బంతులను పట్టుకోవడానికి సుమారు 250 మంది బిబిజిలకు ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక్కో సారి బంతి తగిలి గాయాలవుతున్నప్పటికీ, ఈ బాధ్యతను తీసుకోవడానికి ఏటా వేలాది మంది బాలబాలికలు పోటీపడతారు. బిబిజిలు కూడా డ్రెస్ కోడ్‌ను పాటించాలి.