ఆటాపోటీ

మెరుపు వేగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్ చరిత్రలో అత్యంత వేగంగా సర్వీస్ చేసిన రికార్డు అమెరికాకు చెందిన టేలర్ డెంట్ పేరిట ఉంది. అతను 2010 జూన్ 23న నికొలాస్ లాపెన్టీతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 238 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేశాడు. వింబుల్డన్‌లో ఇప్పటికీ అదే రికార్డు. మహిళల విభాగంలో రికార్డును వీనస్ విలిమియస్స్ సొంతం చేసుకుంది. ఆమె గంటకు 205 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేసింది. ఇక, వింబుల్డన్‌లో సుదీర్ఘమైన మ్యాచ్ విషయానికి వస్తే, జాన్ ఇస్నర్, నికోలాస్ మాహుత్ పోరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2010 టోర్నీలో వీరిద్దరూ 11 గంటల ఐదు నిమిషాలు పోరాటం సాగించారు. వెలుతురు సరిగ్గా లేని కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్ బ్రిటిష్ కాలమానం ప్రకారం జూన్ 22 సాయంత్రం 6.13 గంటలకు మొదలైంది. మూడు రోజులు జరిగిన ఈ మారథాన్ మ్యాచ్ 24వ తేదీ సాయంత్రం 4.47 గంటలకు ముగిసింది. ఇస్నర్ అతి కష్టం మీద 6-4, 3-6, 6-7, 7-6, 70-68 తేడాతో మాహుత్‌ను ఓడించాడు. 183 గేమ్స్‌తో సాగిన పోరులో మొత్తం 980 పాయింట్లు నమోదయ్యాయి. ఇస్నర్ అత్యధికంగా 113 ఏస్‌లు సంధించాడు. 123 బంతులను వినియోగించారు. ఈ మ్యాచ్ వింబుల్డన్‌లోనేగాక, టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.