ఆటాపోటీ

పురాతన టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతనమైన టోర్నీ వింబుల్డన్. లండన్ శివార్లలోని వింబుల్డన్ ప్రాంతంలో నిర్వహించిన లాన్ టెన్నిస్ టోర్నీకే వింబుల్డన్ టోర్నీ పేరు స్థిరపడింది. ప్రతి ఏటా జూన్ మాసంలో 20 నుంచి 26వ తేదీ మధ్యలో వచ్చే సోమవారం రోజున క్వాలిఫయర్స్‌తో మొదలవుతుంది. ఈసారి జూన్ 26న క్వాలిఫయర్స్ ఆరంభమయ్యాయి. మెయిన్ డ్రా జూలై 3 నుంచి ఉంటుంది. 16న పురుషుల ఫైనల్‌తో ముగుస్తుంది. కాగా, సాధారణంగా వింబుల్డన్ టోర్నీ ఆరు వారాలు కొనసాగుతుంది. అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు మొదటి సోమవారంలోగా ముగుస్తుంది. పురుషుల సింగిల్స్, డబుల్స్‌ను మినహాయిస్తే, మిగతా అన్ని విభాగాల్లోనూ బెస్ట్ఫా త్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ రెండు విభాగాల్లో మాత్రం బెస్ట్ఫా ఫైవ్ పద్ధతి అమలవుతుంది. పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒకే విధానాన్ని అనుసరించాలంటూ చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ, వింబుల్డన్ టోర్నీ అధికారులు పట్టించుకోవడం లేదు.