మెయన్ ఫీచర్

ద్వంద్వ ప్రమాణాలతో ఉద్రిక్తతలకు ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంరక్షణ పేరిట హింసకు పాల్పడితే సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే గట్టి హెచ్చరిక చేశారు. అయినప్పటికీ ‘సంశయవాదులు’ మాత్రం మోదీ ‘మాట మీద నిలబడాల’ని మొండిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ వివాదాస్పదం చేయాలనుకుంటున్న వీరు గోసంరక్షణ అంశంపైనా అగ్నిజ్వాలలు రాజేస్తున్నారు. ముఖ్యంగా ద్వంద్వ ప్రమాణాలకు, అర్థరహిత ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచే వామపక్ష ఉదారవాదులు, ‘ఎజెండా జర్నలిస్టులు’ చేసే వ్యాఖ్యానాలు లేనిపోని ఉద్రిక్తతలకు దారితీసేలా ఉంటున్నాయి.
ఒకప్పుడు దేశంలో ‘పాత్రికేయ విలువల’ను నిష్ఠతో, నిబద్ధతతో కచ్చితంగా పాటించేవారు. ఎక్కడైనా మత ఘర్షణలు జరిగితే బాధితుల వివరాలను, రెచ్చగొట్టేవారి సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని విలేఖరులకు, పత్రికల కార్యాలయాల్లోని జర్నలిస్టులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారు. విధ్వంసకారుల, బాధితుల వివరాలు బహిర్గతమైతే ఉద్రిక్తతలు మరింత పెచ్చుమీరుతాయని ఆ రోజుల్లో పత్రికలు అన్ని రకాల జాగ్రత్త చర్యలూ తీసుకునేవి. ‘రెచ్చగొట్టే’ పనికి దూరంగా ఉండాలని అప్పటి మీడియా తనకు తాను విధి విధానాలను రూపొందించుకుంది. వాటిని ఆచరణలోనూ అమలు చేసింది.
70వ దశకం చివరిలో, 80వ దశకం ఆరంభంలో హైదరాబాద్ పాతబస్తీలో వరుసగా మత ఘర్షణలు జరిగేవి. అప్పట్లో ఓ తెలుగు పత్రికలో ఎలాంటి దురుద్దేశం లేకుండానే- అనుకోకుండా ఓ ఫొటోను ప్రచురించారు. మత ఘర్షణల్లో గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆ ఫొటో ప్రచురితమైంది. ఆ ఫొటోను ప్రచురించిన పత్రికపై చర్య తీసుకోవాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తన వాదనకు మద్దతుగా ఆయన ఓ కారణాన్ని చూపారు. ఫొటోలో ఉన్న బాధిత మహిళల నొసట ‘బొట్లు’ ఉన్నందున వారు హిందువులని అందరూ గ్రహిస్తారని, దీని వల్ల మత విద్వేషాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆయన చెప్పిన మాట నిజమే అయినప్పటికీ, హింసను ప్రేరేపించడంలో ఎంఐఎం నేత పాత్రను మనం నిర్లక్ష్యం చేయలేం, పట్టించుకోకుండా ఉండలేం. పత్రికల్లో అలనాటి విలువలను పోల్చిచూస్తే- ఇ ప్పుడు ‘రేటింగ్‌ల కోసం పరుగులెత్తే’ చానళ్ల జర్నలిస్టులు ప్రతి విషయాన్నీ సంచలనాత్మకం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదమైనా, సామూహిక దాడి అయినా, హత్య అయినా- బాధితులు, నిందితులు ఏ మతానికి చెందిన వారన్నది జర్నలిస్టులు ఆరా తీసి వేడివేడి వార్తలు అందించాలని ఆరాటపడుతున్నారు. ‘బ్రేకింగ్ న్యూస్’ పేరిట ముందు సంక్షిప్తంగాను, ఆ తర్వాత పూర్తి వివరాలను అందిస్తున్నారు. బాధితులు మైనారిటీ మతస్థులైతే అది- ‘ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్’గా మారుతుంది. ఒకే సంఘటనకు సంబంధించి ఒకే సమయంలో అరడజను చానళ్లలో కథనాలు వస్తున్నా- ‘మేం మాత్రమే ముందుగా ఇస్తున్న ప్రత్యేక కథనం’, ‘మా చానల్‌లో మాత్రమే తొలి కథనాలు’ అని నిస్సిగ్గుగా చెప్పుకోవడం మీడియా వినూత్న పోకడగా మారింది. ఇది వాస్తవ సమాచారాన్ని ఇచ్చే జర్నలిజం కానేకాదు, ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకున్న ‘ఎజెండా జర్నలిజం’ అని మనం చెప్పుకోవాలి. వీటిని తిలకించి సంబరపడే ‘సొంత వీక్షకులూ’ ఎక్కువవుతున్నారు.
ఈ నేపథ్యంలో హర్యానాలోని బల్లభ్‌గఢ్ వద్ద జరిగిన రైలు ఘటన తర్వాత కొంతమంది అలవాటు ప్రకారం రాద్ధాంతం చేశారు. ఇందులోనూ మతాన్ని చొప్పించారు. ఈ ఘటనకు నిరసనగా కొందరు- ‘గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డుల’ను వాపసు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ‘అవార్డు వాపసీ’లకు మైనార్టీ మతస్థుల సమస్యలే ప్రముఖంగా కనిపిస్తుంటాయి. 2008లో యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన అవార్డును వాపసు చేస్తున్నట్లు షబ్మమ్ హష్మీ ప్రకటించారు. మైనార్టీ మతస్థుల ప్రయోజనాలకు, వారి భద్రతకు మోదీ ప్రభుత్వం సహకరించడం లేదన్నది ఆమె ఆరోపణ. ఆమె ఆరోపణల్లో నిజమెంతో తేలాలంటే మనం కొంత కాలం వేచి చూడాలి. పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మోదీకి ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రతిష్ట పెరిగింది. 2019లోగా మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇంకెంతో సమయం లేదు. ‘అవార్డు వాపసీలు’, ఉదారవాదులు ఇక సిద్ధంగా ఉండాలి.
మరోవైపు కొన్ని ఆంగ్ల చానళ్లు మన దేశాన్ని కించపరచేలా ప్రచారం మొదలుపెట్టాయి. ‘నాట్ ఇన్ మై నేమ్’ అంటూ ‘ఫేస్‌బుక్’లో ఓ నిరసనోద్యమం నడుస్తోంది. భారత్‌లో ప్రజాస్వామ్యం బదులు ‘మూకస్వామ్యం’ న డుస్తోందని, హింసకు ఈ దేశం నిలయమని విష ప్రచారం చేస్తున్నారు. ప్రపంచం దృష్టి ఇప్పుడు మోదీపైనే ఉంది. అందుకే అతణ్ణి అంతర్జాతీయంగా చులకన చేయాలన్నదే ఉదారవాదుల తపన. వీరు చేస్తున్న చేష్టలను చూసి మనం తలలు దించుకోవాల్సిందే. భారత్‌ను ‘రిపబ్లిక్ ఆఫ్ లించిస్థాన్’ (హింసకు రాజ్యం) అంటూ ఉదారవాదులు, కుహనా లౌకికవాదులు లండన్‌లోని గాంధీ విగ్రహంపై రాశారు, మోదీని గోవుగా చిత్రీకరించారు. కరాచీతో పాటు అనేక అంతర్జాతీయ నగరాల్లోనూ వీరు ఇలాంటి చేష్టలకు ప్రణాళికలు వేశారని తెలిస్తే మనకు శ్వాస ఆగినంత పనవుతుంది! నడిరోడ్లపై గొడ్డుమాంసంతో విందులు (బీఫ్ ఫెస్టివల్) చేసుకోవడం మెజారిటీ మతస్థులను రెచ్చగొట్టడం కాదా? ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ఏ మీడియా గానీ, ఏ ఉదారవాదులు గానీ ఎప్పుడైనా ఖండించారా? గొడ్డుమాంసాన్ని రాజకీయం చేసిందెవరు?
దిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే రైలులో జునయిద్ అనే వ్యక్తి హత్యకు గురి కావడాన్ని మితిమీరి ప్రచారం చేస్తున్నారు. రైలులో సీటు విషయమై జరిగిన వివాదంలో ఇతను ప్రాణాలు కోల్పోగా, మీడియా అత్యుత్సాహంగా కథనాలు అందించింది. గొడ్డు మాంసాన్ని తీసుకువెళుతున్నందునే కొందరు గొడవపడి జునయిద్‌ను హత్య చేశారన్నది మీడియా వండివార్చిన కథనం. కావాలని ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడమే ‘ఎజెండా జర్నలిజం’ అని మనం చెప్పుకోవాలి. ఈ తరహా జర్నలిజం ఇపుడు జనాదరణ పొందుతోంది. సామూహికంగా దాడి చేసి హత్యలు చేయడం దేశంలో ఇపుడు ఓ కొత్త పోకడగా మారింది. 2011లో దేశవ్యాప్తంగా జరిగిన సామూహిక దాడుల సంఘటనల్లో 21 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2012లో ఈ సంఖ్య 15గా, 2013లో 14గా నమోదైంది. గత ఏడాది మొహర్రం సందర్భంగా విరాళం ఇవ్వడానికి నిరాకరించిన ఇంద్రజీత్ గుప్తా అనే వ్యక్తిపై ముస్లింలు సమూహికంగా దాడి చేసి హతమార్చారు.
1982- 84 మధ్య కాలంలో బెంగాల్‌లో మార్క్సిస్టుల పాలనలో సామూహిక దాడుల వల్ల 630 మంది మరణించారు. మార్క్సిస్టులు రాజకీయాల్లో హత్యను ప్రధాన ఆయుధంగా వాడుకున్నారనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. ఆనంద్‌మార్గ్‌కు చెందిన సన్యాసులు, గురువులపై కూడా వీరు సామూహికంగా దాడులు జరపగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్‌లో మార్క్సిస్టులు అధికారంలోకి వచ్చాక 1977 నుంచి 1996 వరకూ రాజకీయ కక్షలతో 28 వేల మంది ప్రాణాలు కోల్పోయారని 1977లో అప్పటి సిపిఎం ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్వయంగా శాసనసభలో చెప్పారు. ఆ తర్వాత కూడా బెంగాల్‌లో మార్క్సిస్టుల పాలనలో హత్యలు, రాజకీయ హత్యలు, మానభంగాలు, వరకట్నం చావులకు అంతేలేకుండా పోయింది. దీనిపై వామపక్ష ఉదారవాదులు నోరు విప్పరేం? అలాగే సిపిఎం పాలనలోని కేరళలోనూ హిందువులపై మారణకాండ యథేచ్ఛగా సాగుతోంది. 2003లో కోజికోడ్ జిల్లాలోని మరద్ బీచ్‌లో ముస్లింల సామూహిక దాడిలో జాలర్లయిన 8 మంది హిందువులు ప్రాణాలు కొల్పోయారు.
ఈ దారుణాలన్నీ మోదీ ప్రధాని కాకముందే జరిగాయి. ‘ఫేస్‌బుక్’లో ఉద్యమాలు చేసేవారు, ‘పక్షపాతం లేకుండా’ నడిచే చానళ్ల జర్నలిస్టులు ఈ ఘోరాలపై ఎందుకు గళం విప్పరు?

ఎస్ ఆర్ రామానుజన్ సెల్ 80083 22206