బిజినెస్

తెలంగాణ హబ్‌లో క్రంబ్ రబ్బర్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: దేశంలోనే తొలిసారిగా క్రంబ్ రబ్బర్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది ఆప్టిమస్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడేసిన పాత టైర్ల నుంచి వచ్చే ఈ క్రంబ్ రబ్బర్‌ను చాలావరకు పెద్ద, చిన్నతరహా పరిశ్రమల్లో రకరకాలుగా వినియోగిస్తున్నారు. ఎన్నో ఉత్పత్తులకు ఈ క్రంబ్ రబ్బర్ ముడి సరకుగా ఉందని సంస్థ నిర్వహకులు శనివారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 5న తెలంగాణ హబ్‌లో తమ సంస్థ ప్రారంభమవుతుందని ప్రకటించారు. తమ సంస్థ కార్యకలాపాలు పర్యావరణహితంగానే ఉంటాయని, వృథాగా పడి ఉండే టైర్లను మళ్లీ వినియోగార్హంగా మార్చుతున్నామని, భూమిలో కలిసిపోవడానికి వేల ఏళ్లుపట్టే రబ్బర్‌ను ఇలా బహుళార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లేనని సంస్థ పేర్కొంది. క్రంబ్ రబ్బర్ తయారీ కూడా చాలా సులభమేనని చెప్పింది. టైర్లను పొడిగా మార్చగా వచ్చినదే క్రంబ్ రబ్బర్ అని, దానితో స్పోర్ట్స్ మ్యాట్లు, జిగురు తదితర ఉత్పత్తులను తయారు చేయవచ్చని సంస్థ నిర్వహకులు వివరించారు.