బిజినెస్

మొబైల్స్ దిగుమతులపై 10 శాతం కస్టమ్స్ సుంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారులకు జిఎస్‌టితో లాభం చేకూరింది. దేశంలోకి దిగుమతి అయ్యే మొబైల్ ఫోన్లపై 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది కేంద్రం. దీంతో విదేశీ సంస్థల మొబైల్ ఫోన్ల ధరలు మార్కెట్‌లో పెరగనున్నాయి. దీంతో దేశీయ సంస్థల మొబైల్స్ ధరలు తక్కువగా ఉండి, కస్టమర్లను ఆకర్షించేందుకు అవకాశాలు ఏర్పడనున్నాయి.
ధరలను తగ్గించిన యాపిల్
యాపిల్ సంస్థ తమ ఐఫోన్ ధరలను 4 శాతం నుంచి 7.5 శాతం వరకు తగ్గించింది. జిఎస్‌టి నేపథ్యంలో 256 జిబి సామర్థ్యం కలిగిన ఐఫోన్ 7 ప్లస్ ధర 92,000 రూపాయల నుంచి 85,400 రూపాయలకు దిగివచ్చింది. అలాగే 32 జిబి ఐఫోన్ 6ఎస్ ధర 6.2 శాతం దిగి 46,900 రూపాయలుగా ఉంది. 32 జిబి ఐఫోన్ ఎస్‌ఇ మోడల్ ధర కూడా 27,200 రూపాయల నుంచి 26,000 రూపాయలకు తగ్గింది. ఇదే మోడల్ 128 జిబి ధర 6 శాతం తగ్గి 35,000 రూపాయలకు దిగింది.