తెలంగాణ

కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై పిడి యాక్ట్ కింద కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, విజిలెన్స్ దాడులు పెంచాలని, కల్తీ చేసే వారి అంతు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శనివారం వ్యవసాయాభివృద్ధిపై జరిగిన సమావేశంలో కల్తీ ఎరువులు, విత్తనాలపై ప్రత్యేకంగా చర్చించారు. రైతులను మోసం చేసే కల్తీ విత్తనాల రాకెట్‌లో కొంత మంది వ్యవసాయాధికారులు కూడా భాగస్వాములు కావడం బాధకరం అని అన్నారు. ఈ రాకెట్ అంతు చూడాలి, వారి గుట్టు రట్టు చేయాలి, ఇతర రాష్ట్రాలు కేంద్రంగా అక్రమ వ్యాపారం నడుపుతున్నారని , వారి వివరాలు కూడా తీసుకుని ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని కెసిఆర్ ఆదేశించారు. విజిలెన్స్ దాడులు కొనసాగించాలని చెప్పారు. కల్తీ విత్తనం తయారీ, పంపిణీ, అమ్మకాలను దారుణమైన నేరాలుగా పరిగణించాలని చెప్పారు. బాధ్యులపై పడి యాక్టు కింద కేసులు నమోదు చేయాలి, కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. నిరంతర నిఘా కొనసాగాలి, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని అన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయంపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని అన్నారు. దీని కోసమే ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను గుర్తించి, ప్రతి క్లస్టర్‌కు ఒక ఎంఇవోను నియమించినట్టు చెప్పారు. మండల వ్యవసాయాధికారికి శిక్షణ ఇచ్చి అగ్రానమిస్టుగా తయారు చేయనున్నట్టు చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో ఒక హాలు, చిన్న గోదాము ఉండే విధంగా రైతు వేదికలను నిర్మించనున్నట్టు చెప్పారు. అక్కడే రైతులు నిరంతరం కలుసుకుని వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరపాలని అన్నారు. గ్రామాల్లో కూలీలు దొరికే పరిస్థితి లేదని యాంత్రీకరణమే అంతిమ పరిష్కారమని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా నేలలను బట్టి ఏ పంట వేయాలో అధికారులు చెబుతారని, ఎవరిష్టం వచ్చినట్టు వారు పంటలు వేసే విధానం పోవాలని అన్నారు. ఏ పంటకు డిమాండ్ ఉంటుందో తెలుసుకుని ఆ పంట వేయడం వల్ల గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం అవసరాలు గుర్తెరిగి పంటలు సాగు చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు ఎంత మొత్తంలో ఆహార పదార్థాలు కావాలో ఆ మేరకు పండించాలని అన్నారు. శాస్ర్తియంగా అంచనాకు రావాలని ముఖ్యమంత్రి చెప్పారు.