తెలంగాణ

జోనల్ వ్యవస్థ రద్దు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: జోనల్ వ్యవస్థ రద్దు చేసి, రెండంచెల వ్యవస్థ తీసుకురావడం వల్ల వెనుకబడ్డ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ అంశంపై హడావుడిగా, అశాస్ర్తియంగా నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ ఉద్యోగుల సంఘం నిర్వహించిన రౌండ్‌టెబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. గోపాల్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో జోనల్ వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు దాదాపు అంతా జోనల్ వ్యవస్థ రద్దు అంశాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా శాస్ర్తియంగా ఉండాలని గోపాల్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మూడంచెల వ్యవస్థ స్థానంలో ఇప్పుడు రెండంచెల వ్యవస్థ రావడం వల్ల ఉద్యోగులు రెండు క్యాటగిరీల కిందకే వస్తారని గుర్తు చేశారు. జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి క్యాటగిరీలు మాత్రమే ఉంటాయన్నారు. రాష్టస్థ్రాయి క్యాటగిరీల పోస్టుల భర్తీకి రాష్ట్రం మొత్తం ఒకే యూనిట్ అవుతుందని, అందువల్ల హైదరాబాద్‌లో చదివే విద్యార్థులు, అభ్యర్థులు ఖాళీల భర్తీలో ఎక్కువ శాతం స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంటుందని, వెనుకబడ్డ జిల్లాల విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేక కోచింగ్ కేంద్రాలు ఉంటాయని, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, జిల్లాల్లో ఈ సౌకర్యాలు ఉండవని గుర్తు చేశారు. జోనల్ వ్యవస్థరద్దుకు సంబంధించి ఒక ముసాయిదా పత్రాన్ని ప్రభుత్వమే రూపొందించి, ఉద్యోగ సంఘాలకు అందించాలని, దానిపై విస్తృతంగా చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమారస్వామి పేర్కొన్నారు. వెనుకబడ్డ జిల్లాల నిరుద్యోగుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని తెలంగాణ ఉద్యోగుల మహిళా విభాగం అధ్యక్షురాలు జి. నిర్మల కోరారు. మూడంచెల వ్యవస్థ వల్ల స్థానికులకు న్యాయం జరుగుతుద్న ఉద్దేశంతోనే రాష్టప్రతి ఉత్తర్వులు వెలువడ్డాయని తహశీల్దారుల సంఘం గౌరవాధ్యక్షుడు లచ్చిరెడ్డి పేర్కొన్నారు. జోనల్ వ్యవస్థ రద్దు చేయాలని ఎవరూ డిమాండ్ చేయకపోయినా ప్రభుత్వం ఈ పత్రిపాదనలను ఎందుకు తీసుకువచ్చిందో అర్థం కావడం లేదని తహశీల్దారుల సంఘం అధ్యక్షుడు గౌతం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫోరంఫర్ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయిస్ అధ్యక్షుడు కుమారస్వామి, పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం జనరల్ సెక్రటరీ చక్రవర్తి, కమర్షియల్ టాక్స్ ఉద్యోగుల తరఫున రామచందర్, రవాణ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అంజయ్య, పౌరసరఫరా శాఖ తరఫున బి. వినోద్‌కుమార్ తదితరులు మాట్లాడారు.