తెలంగాణ

సెంట్రల్ వర్సిటీ స్కాలర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూలై 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ)లో పిహెచ్‌డి చేస్తున్న విశాల్ టాండన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్న విశాల్ శనివారం సాయంత్రం అపార్టుమెంట్ 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హెచ్‌సియూలో జనరల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేస్తున్న విశాల్ టాండన్ తన తల్లితో కలిసి నల్లగుండ్లలోని అపార్ట్‌మెంట్ లో ఉంటున్నాడు. అయితే తల్లి ముంబై వెళ్లగా, శనివారం ఇంట్లో విశాల్ ఒంటరిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి స్వస్థలం కర్ణాటకలో బెల్లామ్ ప్రాంతమని, చనిపోయే ముందు సభ్యులకు మెయిల్ చేసినట్టు గుర్తించామని చందానగర్ పోలీసులు తెలిపారు. అయితే మెయిల్‌లో ఏం ఉన్నది..పోలీసులు వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు చందానగర్ పోలీసులు తెలిపారు. తాను ఊహించినట్టుగా జీవితాన్ని మలచుకోలేక పోయాను..ఒంటరిగా బతకలేక పోతున్నాను.. తల నొప్పిగా ఉంటుంది..తలలో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి..ఇంటి తాళం చెవి షూ ర్యాక్‌లో పెట్టాను.. కారు రిజిస్ట్రేషన్ చేయించుకోండి.. చనిపోతున్నందుకు క్షమించాలి. అంటూ కుటుంబ సభ్యులకు పంపించిన ఈ మెయిల్‌లో ఉందని పోలీసులు చెప్పారు. కాగా ఈమెయిల్‌లో ఏముందో చూపించడానికి పోలీసులు నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు మీడియాకు ఇవ్వవద్దని చెప్పినట్టు పోలీసులు పేర్కొనడంతో ఆ ఈమెయిల్‌లో ఇంకా ఏముందోననే విషయం మిస్టరీగా మారింది. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సైదులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.