సాహితి

పారిజాతాపహరణం చెట్టు దొంగతనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును, అని కథ తెలిసిన ముక్కుపచ్చలారని కుర్రాడు కూడా అనడు. అవును, చెట్టు దొంగతనమే అంటున్నారు, నలభై ఏళ్ళుగా అమెరికాలో తెలుగు బోధిస్తూన్న అనువాద అఘాయిత్య ఆచార్య వెల్చేరు నారాయణరావు. వీరి ఎమొరీ విశ్వవిద్యాలయపు సి.వి. ప్రకారం, ఈయన వెలువరించబోతున్న అనువాదాల్లో ఈ పుస్తకం పేరు ఉన్నది. ఆనాడు, నంది తిమ్మన పదహారో శతాబ్దిలో రాసిన ప్రణయ ప్రబంధం పారిజాతాపహరణం. ఇంతకుముందు వీరు అనువాదం చేసిన మనుచరిత్రను, ఇప్పటి ఈ పారిజాతపహరణం రచనను పదిహేనో శతాబ్దపు ‘కోర్ట్‌లీ పోయెం’ అని పిలుస్తున్నారు ఈయన. అంటే ‘ఆస్థాన కవిత’ అని అర్థం. ప్రబంధకాలం అన్నదే ఇక్కడ ధ్వనించదు. ఇవి చిన్న కవితలు కావు. ఒక దీర్ఘ కథాత్మక కవిత అన్నది కూడా, ఇలా పిలిచినపుడు తెలుగేతర పాఠకుడు తెలుసుకోలేడు. ప్రబంధ జానర్(్ళశూళ)లో ఇవి వఛ్చాయి. (్ధరణి) అని తెలిసే అవకాశం లేదు.
పువ్వులు, పడతులు మీద ప్రాధాన్యతతో రాసింది పారిజాతాపహరణం ప్రబంధం. అయిదువందల ఏళ్ల ముందరి రచన అయినపుడు, పారిజాతం ఒక భారతీయ పుష్పం అయినపుడు, ఈ రచన చదివే ఆంగ్ల చదువరికి, ఈ పువ్వుని పరిచయం చేయడం, మన సంస్కృతిని పరిచయం చేయడం ఒక తప్పనిసరి విధానం. అలా కాకుండా, ‘చెట్టు దొంగతనం’ అని పేరు పెట్టి ‘ఆస్థాన కవిత’ అంటే, ఇక్కడ సగం నీరుకారిపోయింది అనువాద శ్రమ.
ఇంగ్లీష్ పూలు అయిన లిలాక్, లిలీ, ఆర్కిడ్, ట్యూలిప్ అలాగే అనువాదంలో వ్యవహరిస్తాము ఆ వాతావరణాన్ని. లక్ష్య భాషలో పాఠకునికి అందచేయడానికి తప్ప, ఆ పువ్వుల పేర్లు మార్చి రాయడం ఇవాళ్టి అనువాద మెలకువ కాదు. అలా ఏకంగా భారతీయ పుష్ప విశేషం అయిన పారిజాతం అన్న పేరును వదులుకోవడం, దూరదృష్టిలేని అనువాదం అవుతుంది. ఇక చెట్టు ఎత్తుకు రావడం జరిగింది పూల తగువువల్లనే. కనుక పారిజాత పూల పేరు పుస్తకం శీర్షికలో ఉండాలి. ‘ఔ్ఘజ్ఘ్ఘీఆ్ద చిళఖజూ’’ ఘ ఔ్ఘఇ్ఘశజ్ద్ఘూ ఆ్ఘళ యచి చిజచిఆళళశఆ్ద షళశఆఖూక జశ పళూఒళ అంటే కొంత సబబుగా ఇంగ్లీష్‌లో చదువుకువారికి అర్థం కావచ్చు. కానీ వెల్చేరు ఇలా చేయరు.
పేర్లు మార్చడంలో ఘనులు వెల్చేరు, కన్యాశుల్కం, పిల్లలను అమ్ముకునే తీరున ‘గర్ల్స్ ఫర్ సేల్’ అని పెట్టి, కళాపూర్ణోదయానికి కథలో బ్రహ్మ, సరస్వతి ముద్దుపెట్టుకుంటారు కనుక ‘ది సౌండ్ ఆఫ్ కిస్’ అని పెట్టి, క్షేత్రయ్య పదాలకు అటు క్షేత్రయ్య పేరూ లేక ఇటు మువ్వగోపాల ప్రసక్తి లేక, శీర్షికగా ‘దేవుడు విటుడైతే’ (త్దీళశ యజూ జఒ షఖఒఆ్యౄళూ) అంటూ ఫడమటి దేశాల్లో కాపీలు ఎలా అమ్ముకోవాలో, ఎలా వారు ఆకర్షితులవుతారో అని ఆలోచించి పేర్లు పెట్టడం వెల్చేరుకు బాగా తెలుసు. ఈ ధోరణిలో వెళ్ళేవారికి, పారిజాత పువ్వుల కథ, చెట్ల దొంగల చెర్లాటగానే మార్కెట్ చేసుకోబుద్ధి అవుతుంది తప్ప, ఇంకో ఆలోచన ఎలా వస్తుంది? పారిజాతం ఒక ప్రాపర్ నౌన్, ఒక సాంస్కృతిక విశేషం.
ఈ పుస్తకాన్ని ఈయన హర్షితా కామత్ అనే వారితో కలిసి సహకార రచనగా, మూర్తి క్లాసికల్ లైబ్రరీ, వారికి ఒప్పందం ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా తీసుకొస్తున్నారు. అక్కడ ఈ తెలుగు రచనలను సబ్మిషన్ స్థాయిలో చూసేది వీరి అనుయాయి డేవిడ్ షుల్మాన్ కావడం, వీరిద్దరూ కలిసి చాలా పుస్తకాలకు సహ అనువాదకర్తృత్వం వహించడం, లేదా ఆయన వీరి రచనలకు ముందుమాటలో, వెనుకమాటలో రాయడం జరిగింది ఇప్పటికే. చాసోమీద మార్క్సిస్ట్ కాదని ఒక అనవసర ప్రస్తావన చేశారు వీరు ఇద్దరూ, ఆ కథల అనువాద సందర్భంలో.
‘కళాపూర్ణోదయం’ అనువాదం అట్టపై ‘ద సౌండ్ ఆఫ్ కిస్’ అని (ఆంగ్ల వచనంలోకి చేసిన) ప్రోజ్ ట్రాన్స్‌లేషన్ అని సూచించకుండా ‘ట్రాన్స్‌లేషన్ ఆఫ్ సిక్స్‌టీన్త్ సెంచురీ తెలుగు నావెల్ ఇన్ వెర్స్’ అని మార్కెట్ చేశారు. ఇందులో వీరు రాసిన ఆంగ్ల పదాలు ఏవీ లేవు. ఎందుకంటే, అలా పింగళి సూరన చెప్పలేదు. ఆయన తన రచనను ‘యపూర్వ కథా సంవిధాన వైచిత్రీ మహనీయంబున్, శృంగార రస ప్రాయంబున్, బుణ్యవస్తు వర్ణనాకర్ణనీయంబున్ నగు కళాపూర్ణోదయంబను మహాకావ్యమున్ నిర్మింప గడంగితి’’నన్నాడు పీఠికలోని వచన భాగం, 16లో. మహాకావ్యం కాదు కదా, కావ్యం అని కూడా ఈ అనువాదకులు చెప్పలేదు. ఇంగ్లీష్‌లో చదివేవారికి మరెలా తెలుస్తుంది అసలు సంగతి? ఇంకా లోపలి అనువాదం ఎలా ఉన్నదో చెప్పాలంటే ఒక ప్రత్యేక ప్రయత్నం అవసరం.
ఇలా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో పదాలు, శతకాలు మొదలుకుని అన్నింటిపై చెయ్యి చేసుకుంటూ, తనకు నచ్చిన రీతిలో పేర్లూ పెట్టడం, అనువాదాలూ చేస్తూ, తనకు నచ్చని విషయాలు అనువాద రచన నుంచి, మూలంలో ఎంత ప్రాధాన్యం అయినవి అయినప్పటికీ, తొలగిస్తూ (గురజాడ ఆంగ్ల పీఠికలు ఇంగ్లీష్ అనువాదం నుంచి తొలగింపు), మాటలు, వాక్యాలూ వదిలేస్తూ, తెలుగు సాహిత్యం, సంస్కృతికి వీరు చేస్తున్న నష్టం అపారంగా ఉన్నది. దీనికితోడు తమకే ఇంగ్లీష్ వచ్చు, అని చెప్పే ఈ తెలుగు మాస్టారు, నాలుగు దశాబ్దాలు అమెరికాలో తెలుగు పాఠాలు చెప్తూ, చేసిన ఈ అనువాదాలవలన, క్లాసిక్స్, ఆధునిక రచనలూ కూడా సరైన ప్రాతినిధ్యం పొందలేదు. ఏ తమిళులో అయితే, వారి జాతీయ కవి కంబన్‌కి, లేదా భారతికి ఇటువంటి నష్టం జరిగితే ఊరుకోరు. స్పందిస్తారు. అడవి దొంగ వీరప్పన్ కథ మోస్తరుగా, పంచ ప్రబంధాల్లో ఒకటైన పారిజాతాపహరణానికి ‘చెట్టుదొంగతనం’ గతి పట్టిస్తున్న వెల్చేరు అనువాద విపరీతం గురించి, ఇది సబబేనా అన్న చర్చ తెలుగు సమాజంలో జరగాలి. విజయవాడ దగ్గరి ఏలూరులో బి.ఏ తెలుగు (1954) చదువుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖలో కూడా తెలుగే చదువుకుని, పిహెచ్‌డి (1974) వరకూ గడిపి, 1971లో అమెరికాలోని విస్కాన్సిన్‌లో మెడిసిన్ విశ్వవిద్యాలయానికి లెక్చరర్‌గా వెళ్లి, అక్కడ తెలుగు శాఖలో పదోన్నతులు పొంది, తాను తనకు ఎంత ఇంగ్లీష్ వచ్చు అని ఇలా అన్ని అనువాదాలు చేస్తున్నారో, అనవసర స్వేచ్ఛలు ఎలా తీసుకుంటున్నారో, తెలుగు సాహిత్య సమాజం పట్టించుకోవడం అవసరం.

- రామతీర్థ 9849200385