సాహితి

స్పర్శ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు సాగరంనుండి
వౌనం అంచులు దాటి
అలల్లా హృదయాన్ని తాకే
అందమైన భావాలు..
కాగితంతో జతకడితే
ముగ్ధమనోహర
అక్షర సుమం విచ్చుకుంటుంది!
తన పెదాలపై
సుతారంగా చందమామ చేసే
సంతకంతో..
నదీమ తల్లి ఆనంద డోలికల్లో
ఓలలాడుతుంది!
నింగి ప్రసాదించే
చినుకు పూలకు
చిరుగాలి లాలిపాట తోడై
తొలకరి నేలను స్పృశించగానే..
ప్రకృతి పరవశిస్తుంది!
రవికిరణ మృదు స్పర్శతోనే..
కమల దరహాసం!
వెండి వెనె్నల వెలుగులతోనే..
కలువల వికాసం!
దేవుని గుడిలాంటి
అమ్మ ఆత్మీయ ఒడి యందు
సేదదీరడంలోనే..
పిల్లలకు సాంత్వనం
మైత్రిభావ ప్రకటనకు
కరచాలనం ఓ గొప్ప సాధనం
ప్రేమలోకంలో తేలియాడే
నవ జంటలకు
కౌగిలింతలతోనే... గిలిగింత!
సయ్యాటలాడుతూ
ఎదపై వాలి అల్లరిచేసే భ్రమరాలతోనే
పువ్వుల తనువంతా పులకరింత!
ఓటమితో కృంగిపోయిన వేళ..
ఒత్తిడులతో కొట్టుమిట్టాడే సమయాన
అయినవారి అనురాగ ఆలింగనమే..
ఓ దివ్య ఔషధం!
స్పర్శే కదా సృష్టికి మూలం!
దాన్ని కొలవడానికి..
లోకంలో లేదే పరికరం!!

- దాస్యం సేనాధిపతి, 9440525544