దక్షిన తెలంగాణ

ఘరానా మోసం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్ రింగ్ కావడంతో ఆఫీస్‌లో ఫైల్‌పై సంతకం చేస్తూనే, ఫోన్ తీసి ‘హలో’ అంది సుజాత.
‘నమో వెంకటేశాయ తల్లీ.. సుజాత గారేనా మాట్లాడుతున్నది’ అవతలవైపు నుండి మృదు గంభీరంగా అచ్చం చిన్న జీయర్ స్వామి గారిలా ఉన్న కంఠం ‘నమో వెంకటేశాయ’ అంటూ వెనక నుండి మంద్రంగా మ్యూజిక్ వస్తుంటే మాట్లాడుతున్నారు. ఒక్క క్షణం తెల్లబోయిన సుజాత తేరుకుని ‘అవునండీ’ అంది ఒకింత ఆశ్చర్యంగా భక్తిగా.. ‘అమ్మా.. మీరున్నది హుస్నాబాద్‌లోనే కదా.. తల్లీ..’
‘అవునండీ’
‘నమో వెంకటేశాయ.. తిరుపతిలోని అలకానంద గురుకుల పాఠశాల అధ్యక్షులు రామతీర్థ స్వామి గురించి వినే ఉంటారు. ఆయన స్వంత సోదరులు, వారి సతీమణి, అమ్మాయి వస్తున్న వెహికిల్.. మీ ఊరు.. దగ్గరలోని ఏదో చిన్న పల్లెటూరు. ఏదో మామిడి.. అనో ఏదో చెప్పారమ్మా.. దాని దగ్గర ఆగిపోయిందమ్మా.. పాపం.. వారు తీర్థయాత్రలకెళ్లి వస్తున్నారమ్మా.. వారి దగ్గర డబ్బులు లేవు. జీపుకి రిపేర్ వచ్చింది. అక్కడి నుండి దగ్గరలోని ఏదైనా వెహికిల్ పట్టుకుని రావాలి.. సాయం సమయమయ్యింది. మీరు అక్కడికి వెళ్లి వారికి సహాయం చేసినా సరే.. లేదా మీకు నేను అకౌంటు నంబర్ చెబుతాను. అందులో డబ్బులు వేసినా సరే.. వారు ఆ డబ్బులతో ఇక్కడికి చేరుతారు. నేను వెంటనే రేపే మీ ఎకౌంట్‌కి డబ్బులు వేసేస్తాను’
‘ఎంతమాట.. అలాగే స్వామీ...’
‘నమో వెంకటేశాయ.. మీరు సహృదయులు అని తెలిసి మీకే చేస్తున్నా.. దాదాపు డ్రైవర్‌తో సహా నలుగురు కదా తల్లీ. దాదాపు పదివేల వరకు అవసరం అవుతాయి. వారి సెల్‌లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. నేనే ఆ డబ్బులు వేయొచ్చు కదా అని మీరనుకోవచ్చు. అయితే ఇక్కడ అన్ని సెంటర్‌లలో ఏదో సాంకేతిక కారణం వల్ల నెట్ కనెక్షన్ పోయింది తల్లీ.. నేను రేపు పొద్దుటే మీ అకౌంట్‌లో డబ్బులు చేస్తాను తల్లీ.. కొంచెం ఆపదలో ఉన్న వారిని ఆదుకో తల్లీ.. వెంకన్న మీకు మేలు చేస్తాడు. వెంటనే చేయి తల్లీ.. లేట్ అవుతున్న కొద్దీ వారికి ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్లు.. తెలియని ప్రదేశం, వేయగానే నాకు ఫోన్ చేయి తల్లీ.. నమో వెంకటేశాయ.. కాల్ కట్ అయ్యింది. సుజాతకి రెండు నిమిషాల వరకు ఏమీ అర్థం కాలేదు. సమయం సాయంత్రం అయిదు.. ఆఫీస్ అయిపోయే వేళ. అంత మొత్తం ఉద్యోగం చేస్తున్న ఆమెకు వెంటనే చేతిలో లేకపోయినా.. సమకూర్చుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. వెంటనే బ్యాంక్‌కెళ్లి ఆయన చెప్పిన అకౌంట్ నంబర్‌కి డబ్బులు డైరెక్ట్‌గా తన ఎకౌంట్ నుండి పంపిద్దామని లేచింది. ఇంత మంది జనం ఉండగా.. తిరుపతిలోని వేదపండితులు తనకే ఫోన్ చేసారంటే చాలా గర్వంగా అనిపించింది. అంతకుముందు కూడా దరిదాపు ఇలాంటివే అనాధ శరణాలయానికి అలాంటి వాటికి ఇచ్చింది. కాని బ్యాంక్ కెళ్లాలంటే ఆటో లేదు. బయటకు రాగానే సోదరుడిలా భావించే కొలీగ్ భాస్కర్ సార్ కనిపించారు. ‘ఏమ్మా.. ఇంత తొందరగా మీరు వెళ్లరే’ అన్నారు. నవ్వుతూ.. ‘ఎటు వెళ్తున్నారు’ అన్నది అడక్కూడదనేమో! ఆపద్బాంధవుడిలా కనిపించాడు. విషయం టూకీగా చెప్పి బ్యాంక్‌కి తీసుకెళ్లమంది. ఆయన, ఇక్కడికి దగ్గర పల్లెటూర్ అంటే చిగురుమామిడి అయి ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక్కసారి వెళ్లి చూసి డైరెక్ట్‌గా వారికే ఇస్తే మంచిది కదా అన్నాడు సాలోచనగా. సరేనని ఇద్దరూ వెళ్లారు. మొత్తం తిరిగినా ఎక్కడా ఆ ఆనవాళ్లు లేవు. ఆయనకు ఫోన్ చేసింది ‘నమో వెంకటేశాయ.. తల్లీ వేసారా..’ అన్నారు. నేపథ్యంలో అదే మ్యూజిక్. ‘లేదు స్వామీ.. వారికే ఇద్దామని మీరు చెప్పిన ప్రదేశానికి వచ్చాము. కాని ఇక్కడెక్కడా లేరు స్వామీ.. అడ్రస్ సరిగ్గా చెప్పండి..’
‘అంత శ్రమ వద్దన్నా కదమ్మా.. ఏదేదో ప్లేస్ చెప్పారు. మీ ఊరు నుండి చాలా దూరమే ఉంటుంది. మీకంత కష్టం వద్దు. మీరు డైరెక్ట్‌గా అకౌంటులో వేయండి.. మీకు నేను రేపు వేస్తాను’ అంటూ ఎవరో ఏదో అడుగుతుంటే.. ‘మన రాం భాగీచాలో ఉంచండి వారిని’ అని చెబుతున్నాడు. ‘తల్లీ.. వాళ్లు చాలా అవసరంలో ఉన్నారు. త్వరగా వేయండి తల్లీ.. అలాగే ఇంత మంచి హృదయం ఉన్న మీ గోత్ర నామాలు చెప్పండి.. పూజ చేస్తాను’ అన్నారు. విషయం విన్న భాస్కర్ గారు, ‘అమ్మా.. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ అని చెప్పి, మీరెలాగూ వెళ్లరని ఇక్కడకు వస్తే వేరే ఏదో ప్లేస్ అని చెబుతున్నారు. మంచివాళ్లకు ఇవ్వడానికి మనం రెడీ కానీ ఇలాంటి మోసగాళ్లకు కాదు. మీరు ఊర్కోండి’ అన్నారు. కొంచెం అలోచిస్తే ఆమెకు నిజమే అనిపించింది. మళ్లీ ఫోన్ చేశారు. ‘స్వామీ మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పండి.. మా చేతిలో వెహికల్ ఉంది. వెళతాం’ అంది.
‘కాదు తల్లీ.. అదెక్కడో చాలా దూరంలో ఉంది. వెళ్లలేరు. రేపు పొద్దుట మీ అకౌంట్‌లో డబ్బు ఉంటుంది. ఇప్పుడు అక్కడ చాలా అర్జెంట్ ఉంది. త్వరగా వేయి తల్లీ..’ అదే కంఠం.. వెనక అదే మంత్రం వినవస్తుంది. ఈసారి ‘మీరు అడ్రస్ కరెక్ట్‌గా కనుక్కుని చెప్పండి స్వామీ’ అంది దృఢంగా. అంతే మళ్లీ ఫోన్ రాలేదు. నెల రోజులు అయింది. రచయిత్రి కాబట్టి ఏదో సాహిత్య కార్యక్రమానికి వెళ్లింది సుజాత. అక్కడ మాటలో మాటగా ఈ విషయం చెప్పగానే.. దాదాపుగా మరో నలుగురికి అలాంటి అనుభవమే జరిగిందనగానే ఆశ్చర్యపోయింది. మరో నలుగురికి ఈ విషయం తెలిస్తే మోసపోకుండా ఉంటారనిపించి, కాగితం, కలం తీసుకుంది!

- నామని సుజనాదేవి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా, సెల్.నం.7799305575