ఉత్తర తెలంగాణ

శాశ్వత నివాసం! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమలు - ద్వేషాలు
మోహావేశాలు
ఆవేశం - ఆక్రోశం
అంతులేని శోకం
ఒక నిముషం మోదం
అంతలోనే క్రోధం!
జననంతో మొదలై
మరణంతో తీరే దిగులు
హితులు - హితోక్తులు
వ్యథలు - గుండెలు రగిల్చే కథలు
అనుమానాలు - అవమానాలు
మరణంతో పొంగుకొచ్చే అభిమానాలు
ఆరాధనలు - ఆవేదనలు
ఆత్మను చంపే ఆలోచనలు
దోచుకోవాలని - దాచుకోవాలని
నీటి బుడగతో ఆడుకోవాలని
హత్యలతో - కక్షలతో
రక్తాక్షరాలతో ఆంక్షలు విధిస్తూ
ఒక వైపు
ధనంతో, ధన బలంతో
బిలియన్లంటూ - ట్రిలియన్లంటూ
మరేదో అంటూ
అంతులేని సంపదలతో
అంతస్తులపై - అంతస్తులు కడుతూ
మరో వైపు
మరణాన్ని శాసించాలని
మరేదో సాధించాలని..
మట్టి మనిషికి ఎంత ఆశ!
ఆకాశంలో విహరించినా
ఎసిలలో పవళించినా
చివరికి మన గమ్యం
అనంత సత్యంవైపే!
మన శాశ్వత నివాసం!
ఊరి బయటి శ్మశానమే!
- సి. రామన్ కుమార్ రెడ్డి
మంథని, పెద్దపల్లి జిల్లా
సెల్.నం.9440449392

ప్రేమ
ప్రేమ.. ఎక్కడుంటావు నువ్వు?
ప్రియ పెదవుల వంపుల్లోనా..
మూతివిరుపుల్లోనా?
ఒంటి ఒంపు సొంపుల్లోనా..
కసి రేగే కౌగిళ్లలోనా?
పూలమాలలా..
చేతులు అల్లే అల్లికలోనా?
పులకరించే ప్రకృతిలోనా?
పలుకరించే నవ్వులలోనా?
నువ్వెక్కడుంటావు?
కొందరు నువ్వు విషమని అంటారు..
మరికొందరు నువ్వుమృతమని అంటారు!
అసలు ఏది నువ్వు?
నువ్వు తరగని గాధవా?
తీరని వ్యథవా? ఏది నువ్వు?
ఏమి నీ ఆంతర్యం?
ఏది నీ సౌందర్యం?
నీవే జీవితం!
నీతో జీవితం
అప్పుడప్పుడు అస్తవ్యస్తం
అయితేనేం?
నీతోనే జీవనం పరిమళాల మేళం!
నీవే.. బ్రతుకుకు ఆలంబనం
నీవే జీవితానికి ఆభరణం!
నీవే.. జీవితానికి ఆనందం!
నీతోనే కదా!
జీవితం ఆహ్లాదమయం!!
- రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, హైదరాబాద్, సెల్.నం.9866583907

కలవరింతల చీకటి

అన్నీ కలవరింతల రాత్రులే తప్ప
పూలపాన్పు నిద్ర రాత్రులు లేవు
అమావాస్య ఓ రాత్రి అతిథి కాదు
మనసును నిరంతర గాయాలు చేస్తున్న
అమావాస్య!
నిన్న రావటం నేడు వెళ్లిపోవటం లేదు
జీవితం పంచాంగం కాదు
అన్ని దినాలు అన్నీ అమావాస్యలే!
కన్నీటి రాత్రులే!
పన్నీరు గూర్చి నేను పరితపించింది లేదు
పన్నీటిలో మునిగి తేలింది లేదు
కన్నీరు లేని అడుగుల కొరకు
నిరంతర ప్రయాణం
నింగిలోని నక్షత్రం నేల రాలినట్టుగా వుంది
మత్తు నిద్రలు వేరు రాత్రులు వేరు
చిత్తుగా జీవితం ఓడిపోయిన రాత్రులు వేరు
అన్నీ ఓడిపోయిన రాత్రులే!
కత్తిమీద ప్రయాణం
చిన్నప్పటి నుండే ఉంది
భయం లేదు బాధ లేదు
మల్లెపూల తోట కొరకు
పరుగు తీసింది లేదు
ముళ్లను రాళ్లను ఏరి పారేయాలని
ఏం లాభం!
చీకటి రాత్రి
మిణుగురులను మింగుతున్న రాత్రి!
- సిహెచ్.మధు, నిజామాబాద్, సెల్.నం.9949486122

ఎలా తెలుపను?

తొలిచూపు ప్రేమ ఆకర్షణ అనేవాడిని,
నిను చూసిన ఆ తొలి క్షణందాకా..
ఎన్నోసార్లు వెనె్నల్లో నే చూసిన గోదారి తళతళలు,
నీ కళ్ల మిలమిలల్లో కనిపించేదాకా..
భావం పంచుకోడానికి, చూసిన కళ్లకి మాటలు రావు,
చెప్పే నోటికి, చూపులేదు
నాకే తెలియని నా మనసు అనే్వషణకి అర్థం
నువ్వని, ఆ రూపం నీదేనని,
నా సగభాగానివి నువ్వేనని,
పంచుకుని పనిచేసే పంచేంద్రియాలు
నిను చూసిన విస్మయం తో మొద్దు బారినాయి!
తెలిసింది. చివరికి నువ్వు నా దానవేనని,
నాలో నాదానివనీ
నీకు తెలిసేలా, అది నీకెలా తెలుపను ప్రియా!
- చామర్తి అరుణ, హన్మకొండ, సెల్.నం.9000683826

ఓ నరుడా!
నీదన్నది నాదన్నది ఏమున్నది ఓ నరుడా!
నవరంధ్రాల శరీరం శాశ్వతం కాదు మేలుకో!
నాదంటూ నాదంటూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నావు!
బంధంలా గోడలను తెంచుకొని మున్ముందుకు సాగేందుకు మేలుకో!
అంతా నాకే అందరిది నాకే కావాలి కావాలి అంటున్నావు!
ఎప్పటికైనా కాయము కాటికేగును కదా మేలుకో!
ధనమంటూ ధనమంటూ కాలం వెంబడి ఉరుకులు పరుగులు!
ఏదైనా వచ్చునా నీ చివరంటూ మేలుకో!
- తక్కెడశిల జాని, సెల్.నం.9491977190

ప్రేమ మోజు!

సరిపోయేనా?
ఒకే ఒక్క రోజు ప్రేమకు
ఈ కొలమానం తరాజులో
మోజు తీరేనా
ఈ తరం యువతకు!
నేటి ప్రేమ..
విచ్చలవిడి బజారైంది!
ఫలించక..
బతుకు బేజారవుతోంది!
నిజమైన ప్రేమ..
నిజాయితీ వుండాలి!
కలిసి ఎగిరే పక్షుల
కిలకిలా రావాలు..
ప్రేమ జంటలకు
ఆదర్శం కావాలి!
భౌతిక ప్రేమ అశాశ్వతం!
విశ్వాసంతో కూడిన
ప్రేమే నిలుస్తుంది కలకాలం!
- తోట సదానందం
మంచిర్యాల
సెల్.నం.9908594669

పచ్చని చెట్టు

పచ్చని చెట్టును చూస్తే
నన్ను చూసి గేలి చేసినట్టుంది
చూడు
నీవల్ల ఏమైనా ఉపయోగముందా?
మనిషినని విర్రవీగుతావు
కానీ,
నీతోటి మనుషులకే కాదు
ఎవరికైనా సహాయం చేసావా
నీవల్ల ఈ ప్రకృతికి ఏమైనా ప్రయోజనముందా?
అని ప్రశ్నించినట్టుంది
నన్ను చూడు
నువ్వు నన్ను నరుకుతూ పోతున్నా,
నీ జీవితానికి ప్రాణవాయువునిస్తాను
చక్కని గాలినిస్తాను
ఇంటికి కలపనిస్తాను
ఎండలో నీడనిస్తాను
వంటచెరుకుగా కాలుతూ కూడా
నేను ఆనందంగా బూడిదనవుతాను
చల్లని నీడనిస్తూ
జోలపాట పాడే అమ్మనవుతాను
ఒక మొక్క నాటు
నీ ఆరోగ్యానికి ఆయువు పోసి
నీ ఇంటి చిరునామా ఔతానంటోంది చెట్టు
- మార్టురి శ్రీరాం ప్రసాద్
బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరి జిల్లా

తీరని దాహం

ఎందో ఈ గుండియ
కైత రాయనిదే జరుగదు ఓ ఘడియ
ఎంతో ఈ గుణం
కైత రాయనిందే నను వీడదు ఆ క్షణం
ఎందో ఈ తీరని దాహం
కమ్మని కైత అల్లనిదే చల్లబడదు నా మస్తిష్క దేహం
ఏమో ఈ కైతలు
ఎక్కడివో ఈ కైతలు
చివరికి ఎక్కడికి చేరేనో
కాశీకో కంచికో మరి!
- నల్లగొండ రమేష్
ఆసిఫాబాద్, కొమురం భీ జిల్లా
సెల్.నం.9441711832

నిశ్శబ్దం!

మసిపూసి మారేడుగాయ
జేసుడంటే గిదెనేమో..
మాయ మాటలు చెబుతూ
నీ పనులు చేసుకుంటూ
నాతో చేయిస్తూ
చులకన జేసి నన్ను ఏమార్చుతున్నావు!
కానీ ప్రతి మంచివాడి
వౌనం వెనుక రగిలే
ఒక నిశ్శబ్ద యుద్ధం దాగి ఉంటుంది!
అది భూకంపంలా
మారి బద్దలైన రోజు
నీ ఉనికిని ప్రశ్నిస్తుంది సుమా!
- గుడికందుల అరుణ్
ఇందుర్తి,సెల్.నం.7093791674