రాజమండ్రి

30న గుంటూరులో కథా రచయితల శిక్షణ శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్య రంగానికి కొత్త రచయితలను అందించాలనే లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంటూరులో కథా రచయితల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసిద్ధ కథా రచయితలు విహారి, డా. వేదగిరి రాంబాబు, పాపినేని శివశంకర్, డా. సి భవానీదేవి, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, పి చంద్రశేఖర్ ఆజాద్, మధురాంతకం నరేంద్ర, తదితరులు కథా రచనపై శిక్షణ ఇస్తారు. శిబిరంలో పాల్గొనేవారి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉండాలి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెంది ఇంతవరకు ఒక్క కథ కూడా రాయని, కథా రచనపై ఆసక్తి వున్నవారు మాత్రమే ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనటానికి అర్హులు. ఎలాంటి ప్రవేశ రుసుము లేని ఈ శిబిరంలో తర్ఫీదు పొందిన వారికి అదేరోజు సాయంత్రం జరిగే సభలో శిక్షణ పొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. వచ్చినవారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వసతి ఏర్పాట్లు మాత్రం అభ్యర్థులు ఎవరికి వారే చేసుకోవాలి. ఔత్సాహికులు 15వ తేదీలోపు తమ వయస్సు, విద్యార్హత, సాహిత్యాభినివేశం, తదితర వివరాలతో ‘ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, పోస్ట్ బాక్స్ నం. 5, డోర్ నం. 11-57/1-32, జెఆర్ కాంప్లెక్స్, రెండో అంతస్తు, రజక వీధి, విజయవాడ - 520001’ చిరునామాకు పోస్ట్‌కార్డ్, కొరియర్ ద్వారా తమ అంగీకారం తెలపాలి. సంఘం ఎంపిక చేసిన వారికి మాత్రమే శిక్షణ పొందే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలకు తావులేని వారే పాల్గొనాలని వెంకటసుబ్బయ్య, ప్రకాష్ ఆ ప్రకటనలో వివరించారు.