విజయవాడ

స్నేహితురాలు (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నువ్వు భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండిపోతావా? మీ ఇంటి ఎదురుగానే మా పిన్ని ఇల్లు. మీ ఇల్లు నరకంలా ఉంటుందట. కలిసినప్పుడల్లా చెబుతుంటుంది. మీ అన్నలిద్దరూ మందుబాబులు. రాత్రి 10గంటల తరువాత ఇంటికి చేరి రచ్చరచ్చ చేస్తారట. తిట్లు, అరుపులు, అప్పుడప్పుడూ మీ వదినలను కొట్టటం నిత్యం జరిగే తంతట. మీ అమ్మా, నాన్న ఈ గోల భరించలేక తొమ్మిదింటికే భోజనం చేసి, తలుపులు బిగించుకొని పడుకుంటారట వారి గదిలో. ‘మీ తాగుబోతు అన్నలతో మేము పదేళ్లుగా నరకం చవిచూస్తున్నాం. అయినా మాకు విడాకులు ఇచ్చేయండని అడగలేదు. దేవుని లాంటి భర్తను వదులుకొని నువ్వెందుకొచ్చావు?’ అని వారు ప్రశ్నిస్తే ఏంచెబుతావు? ఆడపిల్లలు అప్పుడప్పుడూ పుట్టింటికి వస్తుండవచ్చు. మరి నువ్వు ఎల్లకాలం భర్తను వదిలేసి జీవితాంతం వాళ్లదగ్గర ఉంటానంటే ఊరుకుంటారా? నినె్నంత హీనంగా చూస్తారో కదా! వేరే ఇల్లు తీసుకొని వుంటే భర్తను వదిలి వచ్చిన ఆడదానివని ప్రతి మగాడూ అదోవిధంగా చూస్తాడు. ఆలోచించి చెయ్యి ఏ పనైనా!’ సున్నితంగానే చెప్పింది సుమతి.
ఆమె మాటలకి కోపమొచ్చి విసురుగా లేచి వెళ్లిపోయింది సుజన.
మర్నాడు ఆమె తల్లికి ఫోన్ చేసి ‘సుజన వుందా?’ అని అడిగింది సుమతి.
‘అదసలు ఎందుకు వచ్చిందో? ఎందుకు కోపంగా వెళ్లిపోయిందో అర్థంకాలేదమ్మా! దుడుకు పిల్ల. భర్తతో గొడవపడి వచ్చిందేమోనని మేమంతా భయపడ్డాం. అదేంలేదని తెలిసి సంబరపడిపోయాం. మీ ఇంటికి వచ్చిందటగా. ఏమైనా చెప్పిందా?’ అంటూ అడిగింది ఆ కన్నతల్లి.
‘మిమ్మల్ని చూడాలని వుందంటే పంపాడట. నాలుగు రోజులైందిగా రమ్మని ఫోన్ చేశాడట. అడగ్గానే పంపాడు, పిలిచినపుడు వెళ్లటం ధర్మం కదా!’ అన్నానే్నను. పిచ్చిపిల్లకు కోపమొచ్చింది’ అంటూ వివరించింది సుమతి.

- చావలి సూర్యం, విజయవాడ